ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఆత్మవిశ్వాసం’పై రామకృష్ణ మఠ్ తరగతులు

ABN, First Publish Date - 2020-10-20T19:53:47+05:30

ఏ పని చేయాలన్నా.. చాలా మందిలో ఏదో ఒక మూలన కాస్తంత భయం నెలకొని ఉంటుంది. చెయ్యాలా.. వద్దా.. చేస్తే ఏమవుతుందో.. ఎవరైనా ఏమన్నా అంటారా.. అనుకుంటూ రకరకాల అనుమానాలతో బెంబేలెత్తుతుంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఏ పని చేయాలన్నా.. చాలా మందిలో ఏదో ఒక మూలన కాస్తంత భయం నెలకొని ఉంటుంది. చెయ్యాలా.. వద్దా.. చేస్తే ఏమవుతుందో.. ఎవరైనా ఏమన్నా అంటారా.. అనుకుంటూ రకరకాల అనుమానాలతో బెంబేలెత్తుతుంటారు. ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని స్వామి వివేకానంద అంటుంటారు. ఆయన బోధనలు ఆచరణలో పెడితే.. నిర్భీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారతారని ఎందరో జీవితాలు ఉదాహరణగా నిలుస్తున్నాయి. యువతలో ఆత్మ విశ్వాసం నింపే కార్యక్రమంలో భాగంగా.. ‘ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడం’పై రామకృష్ణ మఠ్‌కు చెందిన ‘వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్’ ఆన్‌లైన్ తరగతులకు రూపకల్పన చేసింది. ఈ నెల 27 నుంచి  31 వరకు క్లాసులు జరగనున్నాయి. ఉదయం 6.15 గంటల నుంచి 7.15 గంటలకు వరకు సాగనున్నాయి.  16 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయస్సువారు మాత్రమే అర్హులు.  


ఆర్‌కే మఠ్‌లో యోగా, ధ్యానం, వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందింప చేసే కోర్సులు కూడా నిర్వహిస్తున్నారు. మహిళలకు, న్యాయవాదులకు కూడా ప్రత్యేక కోర్సులున్నాయి. బాలల కోసం బాల వికాస్ నిర్వహిస్తున్నారు. 


మరిన్ని వివరాలకు 040-27627961, 9177232696 నెంబర్లలో సంప్రదించవచ్చని రామకృష్ణ మఠం ప్రతినిధులు తెలిపారు.


రామకృష్ణ మఠం పని వేళలు: ఉదయం 8.30 గంటల నుంచి 11.30 గంటల వరకు; సాయంత్రం 4.30 గంటల నుంచి 7.30 గంటల వరకు.

Updated Date - 2020-10-20T19:53:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising