ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రామకృష్ణ మఠంలో యోగా అధ్యయన శిబిరం

ABN, First Publish Date - 2020-03-12T22:26:48+05:30

రామకృష్ణ మఠంలో యోగా అధ్యయన శిబిరం ప్రారంభం కానున్నట్టు వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రామకృష్ణ మఠంలో యోగా అధ్యయన శిబిరం ప్రారంభం కానున్నట్టు వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్ ప్రకటన విడుదల చేసింది. ప్రతి శని, ఆదివారాల్లో జరిగే ఈ సర్టిఫికేట్ కోర్సు మార్చి 22 నుంచి జూలై 5 వరకు సాగనున్నట్టు ప్రకటనలో తెలిపింది. సాయంత్రం 5.20 గంటల నుంచి 7.30 గంటల వరకు సాగనున్నాయి. కోర్సులో భాగంగా యోగ సూత్రాలు, ప్రాణయామం/ముద్ర నైపుణ్యాలు, ఉన్నత ఆసనాలు, సూర్య నమస్కారాలు, యోగ వేదాంతం ప్రకారం ధ్యానం, స్వామి వివేకానందుడు చెప్పిన నాలుగు యోగాలు, నిత్య జీవితంలో భగవద్గీత మొదలైన అంశాలు ప్రస్తావించనున్నారు.

 

ఉద్వేగాలను అదుపు చేసుకోవడం, ఒత్తిడి నుంచి బయటపడటం, ఆరోగ్యకరమైన శరీరం, మనసు, ఆధ్యాత్మికంగా మరింత ముందుకు వెళ్లడం, స్వయం అవగాహన, అంతరంగ శక్తి.. యోగా వల్ల మరింత పెరుగుతాయని తెలిపారు.

 

ఆర్‌కే మఠ్‌లో యోగా, ధ్యానం, వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందింప చేసే కోర్సులు కూడా నిర్వహిస్తున్నారు. మహిళలకు, న్యాయవాదులకు కూడా ప్రత్యేక కోర్సులున్నాయి. బాలల కోసం బాల వికాస్ నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలకు 040-27627961, 9177232696 నెంబర్లలో సంప్రదించవచ్చని రామకృష్ణ మఠం ప్రతినిధులు తెలిపారు.

 

రామకృష్ణ మఠం పని వేళలు : ఉదయం 8.30 గంటల నుంచి 11.30 గంటల వరకు; సాయంత్రం 4.30 గంటల నుంచి 7.30 గంటల వరకు.

Updated Date - 2020-03-12T22:26:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising