ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉత్సాహంతోనే పురోగతి

ABN, First Publish Date - 2020-09-17T08:09:32+05:30

‘‘ఉత్సాహవంతునికి అసాధ్యమైనదేదీ ఉండదు. సరైన మార్గంలో చేసే ప్రతి ప్రయత్నం సత్ఫలితాన్నిస్తుంది’’ ..అని దీని అర్థం. భగవద్గీతలో కూడా భగవంతుడు ‘ఉద్ధరేదాత్మనాత్మానాం, నాత్మానమవసాదయేత్‌’ అన్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • సోత్సాహానాం నాస్త్య సాధ్యం నరాణాం
  • మార్గారబ్ధాః సర్వయత్నాః ఫలన్తి

‘‘ఉత్సాహవంతునికి అసాధ్యమైనదేదీ ఉండదు. సరైన మార్గంలో చేసే ప్రతి  ప్రయత్నం సత్ఫలితాన్నిస్తుంది’’ ..అని దీని అర్థం. భగవద్గీతలో కూడా భగవంతుడు ‘ఉద్ధరేదాత్మనాత్మానాం, నాత్మానమవసాదయేత్‌’ అన్నాడు. మానవుడు తనను తానే ఉద్ధరించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నిరుత్సాహపరచుకోకూడదు. తన మనసులోని బలహీనతలను.. బలమైన మనసు ద్వారా అధిగమించి లక్ష్యం వైపు పయనించాలి. పురుషుడైనవాడు ఫలం నిశ్చయించుకుని, ఉత్సాహంతో ఉద్యమస్ఫూర్తితో కర్మ చేయాలి. అప్పుడే దైవం అలాంటివాడికి సహకరించి.. చేసిన కర్మకు ఫలితం అందిస్తాడు. గానుగ ఆడిస్తేగానీ నూనె, ఘర్షణ చేస్తేగానీ నిప్పు పుట్టవు. అట్లే.. ఉత్సాహం లేకుండా చేసే ప్రయత్నం ఫలించదు. ఉత్సాహంగా కర్మ చేయకుండా, కేవలం దైవాన్ని నమ్ముకున్నవాడు నీటిలో పడవను ఇష్టం వచ్చినట్లు పోనిచ్చేవాడిలాగా మునిగిపోతాడు. నిరుత్సాహమే మనిషికి ప్రధాన శత్రువు. అది ఎంతటివారినైనా నిర్వేదానికి గురిచేస్తుంది. లొంగదీసుకుని కుంగదీస్తుంది. మనిషి తాను దుర్బలుణ్నని, అగోచర శక్తుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉన్నానని భావించకూడదు. అది దైన్య లక్షణం. అలాంటి ఆలోచనలు మనిషిని మరింత లోతులకు దింపేస్తాయి.


అనిర్వేదః శ్రియోమూలం అనిర్వేదః పరం సుఖం

అనిర్వేదోహి సతతం, సర్వార్థేషు ప్రవర్తకః

రామాయణంలోని సుందరకాండలో కనిపించే అద్భుతమైన సూక్తి ఇది. ‘నిర్వేదం లేకపోవడమే (ఉత్సాహమే) సర్వసంపదలకూ మూలం. అదే సర్వసౌఖ్యాలకూ కారణం. అదే అన్ని పనులూ చేయిస్తుంది’ అని దీని అర్థం. బుద్ధిమంతులలో శ్రేష్ఠుడిగా పేరొందిన హనుమంతుడు లంకలో సీతమ్మ జాడ తెలుసుకోలేకపోయినందుకు నిరుత్సాహపడి ప్రాణత్యాగం చేసుకోబోయాడు. నిరాశానిస్పృహలతో కలత చెందాడు. కానీ, ఆయనకున్న అపార అనుభవం కారణంగా తనకు తానే ఇలా సంభాళించుకుని.. అధైర్యపడకుండా సీతాన్వేషణను ద్విగుణీకృత ఉత్సాహంతో కొనసాగించాడు. ఆ స్వామి ఆలోచనా దృక్పథం మానవాళికి ఎప్పుడూ ఆదర్శనీయమే. ఆధునిక కాలంలో కూడా.. ‘నిర్భయత్వం, ఉత్సాహబలం అద్భుతమైన పనులు చేయిస్తాయి. లెండి మేల్కొనండి, గమ్యాన్ని సాధించేవరకూ ఆగకండి’ అని యువతను ఉత్సాహపరచారు స్వామి వివేకానంద. కనుక ఈ ప్రపంచంలో మానువుణ్ని పురోగమింపజేసేది ఉత్సాహబలమే అని తెలుసుకుని మసలుకోవాలి. ఎంతటి కఠిన లక్ష్యాలనైనా సాధించాలి.

 మేఘశ్యామ (ఈమని), 8332931376

Updated Date - 2020-09-17T08:09:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising