ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వధర్మాచరణయే శ్రేయస్కరం

ABN, First Publish Date - 2020-07-03T08:53:51+05:30

చంద్రుని శరీరమే అమృతంతో నిండినది. అతడు ఓషధులకు అధిపతి (సోమః ఓషధీనా మధిపతిః). అసమాన సౌందర్యం చంద్రుడి స్వంతం. అయినా సూర్యోదయమవగానే చంద్రుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • అయమమృత నిధానం నాయకో ఔషధీనాం
  • అమృతమయ శరీరః కాన్తియుక్తోపి చంద్రః
  • భవతి విగత రష్మిః మండలే ప్రాప్య భావః
  • పరసదన నివిష్టః కో లఘుత్వం న యాతి! (చాణక్య నీతి)

చంద్రుని శరీరమే అమృతంతో నిండినది. అతడు ఓషధులకు అధిపతి (సోమః ఓషధీనా మధిపతిః). అసమాన సౌందర్యం చంద్రుడి స్వంతం. అయినా సూర్యోదయమవగానే చంద్రుడు తేజస్సును కోల్పోతాడు. అతనిలో ఉన్న అమృతం కూడా అతని కళలను నిలుపలేదు. రాత్రనేది చంద్రుని భవనమయితే పగలు సూర్యుని భవనంగా చెపుతారు. పరాయి ఇంటిలో ఉండవలసి వస్తే ఎవరికయినా ఆశించిన గౌరవం లభించదు. పరాయి పంచన బ్రతకడం ఎంతవారికయినా దుఃఖమయమే అంటాడు చాణక్యుడు. ‘స్వధర్మం’ కూడా అలాంటిదే. అది మన ఇంటిలాంటిది. పరధర్మం ఇతరుల ఇంటివంటిది. మనం ఎంత జాగ్రత్తగా, భయభక్తులతో ఉన్నా పరాయి ఇంటిలో ప్రశాంతత ఉండదు. అదే మన ఇంటిలో మనమెలా ఉన్నా సుఖంగా ఉంటుంది.


శ్రేయాన్‌ స్వధర్మః విగుణః పరధర్మాత్‌ స్వనుష్ఠితాత్‌

స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మః భయావహః


‘చక్కగా ఆచరించిన పరధర్మాని కన్నా నిష్ఠగా ఆచరించని మన ధర్మమే మేలైనది. స్వధర్మాచరణలో చావయినా మంచిదే, పరధర్మమెప్పుడూ భయంకరమైనదే’ అంటుంది భగవద్గీత. ప్రేయస్సు, శ్రేయస్సు అనే రెండు మార్గాలు మనముందున్నాయి. సక్రమమా అక్రమమా అనే ఆలోచన లేకుండా ఐహిక భోగభాగ్యాలు పొందేందుకు పరధర్మాన్ని ఆచరించడం ఒక మార్గం. అది ప్రేయోమార్గం. స్వధర్మాచరణలో, న్యాయబద్ధంగా, అర్థకామాలను సాధిస్తూ, వాటిని అర్హులతో, ఆర్తులతో పంచుకుంటూ, సంపదను సద్వినియోగం చేస్తూ మోక్ష మార్గాన్ని ఆశ్రయించడం రెండవ మార్గం. అది శ్రేయోమార్గం. ‘ఇందులో దేనిని ఎన్నుకుంటావో నీ స్వేచ్ఛ’ అంటుంది కఠోపనిషత్తు. 


స్వధర్మం అంటే ఏమిటి? సహజ స్వీకృతిని స్వధర్మంగా చెప్పుకోవచ్చు. దేశకాలమాన పరిస్థితులకు, నమ్మకాలకు, విశ్వాసాలకు అతీతంగా, శాశ్వత విలువల ఆధారంగా, సమత్వ దృష్టి కోణంలో ఆవిష్కృతమై, ఏ ప్రలోభాలకూ, భయాలకు లోనుగాని మానసిక సన్నద్ధతయే స్వధర్మంగా చెప్పబడుతుంది. స్వార్థ ప్రయోజనాలకో, ప్రలోభాలకో, భయానికో లొంగిపోయి ధర్మమార్గాన్ని అతిక్రమించడం ‘పరధర్మం’గా చెప్పుకొంటాము. కర్తవ్య నిర్వహణలో ఎవరైనా నీతి నిజాయతీతో పనిచేస్తే స్వధర్మాన్ని అనుసరించిన వారవుతారు. స్వార్థపరులై అక్రమమార్గంలో పయనిస్తే పరధర్మాన్ని అనుసరించిన వారవుతారు. కాబట్టి..  భోగభాగ్యాలను ఆశిస్తూ స్వార్థపరులై చరించడం కన్నా ఉన్నదానితో తృప్తిగా, శాంతియుతంగా జీవించడమే మేలు. అదే ఉత్తమ జీవన విధానం.


పాలకుర్తి రామమూర్తి

Updated Date - 2020-07-03T08:53:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising