ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు

ABN, First Publish Date - 2020-06-17T09:12:51+05:30

ఈ ప్రపంచమంతా పంచభూతాత్మకం. మన శరీరం కూడా.. ‘పృథివ్యాపస్తేజో వాయురాకాశాత్‌’.. అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాలతో నిర్మితమైనదే. పైకి కనిపించేదంతా స్థూల శరీరం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ ప్రపంచమంతా పంచభూతాత్మకం. మన శరీరం కూడా.. ‘పృథివ్యాపస్తేజో వాయురాకాశాత్‌’.. అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాలతో నిర్మితమైనదే. పైకి కనిపించేదంతా స్థూల శరీరం. స్థూల శరీరంలో సూక్ష్మ శరీరం, కారణ శరీరాలున్నాయి. ఎముకలు, మూలగ, రక్తనాళాలు, మాంసం, రక్తం, చర్మం అనే అనే ఆరు పదార్థాలతో ఏర్పడింది స్థూల శరీరం. తల, కాళ్లు, చేతులు, వెన్ను, మస్తకం అనే అవయవాలతో మలమూత్ర సహితమై, ‘నేను’, ‘నాది’ అనే అహంకారంతో కునారిల్లేదే స్థూలశరీరం.


ఇక.. మనసు, బుద్ధి, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, సూక్ష్మ పంచభూతాలు కలిసి మొత్తం పదునేడు తత్వాలతో ఏర్పడింది సూక్ష్మ శరీరం. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలంటే స్థూల శరీరంలో బయటకు కనిపించే కళ్లు, చెవులు, కాళ్లు, చేతులు కాదు. అవి ఆ ఇంద్రియాలకు చెందిన బాహ్యోపకరణాలు. ఈ ఉపకరణాల ద్వారా విషయాలు ఇంద్రియాలకు చేరతాయి. ఉదాహరణకు బయటకు కనిపించే కన్నులో నేత్రేంద్రియం లేదు. నేత్రేంద్రియం మెదడులోని నాడీ కేంద్రంలో ఉంటుంది. ఇతర ఇంద్రియాల విషయం కూడా ఇంతే. ఇంద్రియాలన్నీ శరీరంలోని నాడీ మండలంలో ఉంటాయి. కన్ను ద్వారా దృశ్యం నేత్రేంద్రియానికి చేరుతుంది. సూక్ష్మ పంచభూతాలంటే శబ్ద స్పర్శ రూప రస గంధాదులు. వీటినే విషయాలు లేదా పంచ తన్మాత్రలు అంటారు. ఇంద్రియాల ద్వారా విషయాలు మనసుకు చేరుతాయి. మనసు బుద్ధికి అందజేస్తుంది. బుద్ధి నుండి జీవుడు గ్రహిస్తాడు. అప్పుడు చేయవలసిన పనికి కరేంద్రియాలను నియమిస్తాడు.


స్థూల శరీరాన్ని తేజోమయం చేస్తున్నది సూక్ష్మ శరీరమే. సూక్ష్మ శరీరానికి ఆధారం ఆత్మ. కాబట్టి సూక్ష్మ శరీరం లేకుండా స్థూల శరీరం ఎందుకూ పనికిరాదు. స్థూల శరీరం సూక్ష్మ శరీరంతో కలిసి విధులు నిర్వర్తిస్తున్నది. ఈ శరీరమే ఆత్మజ్ఞానం పొందడానికి అనువైనది. జీవుడు శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు సూక్ష్మ శరీరంతో కూడి బయటకు వెళ్తాడు. అప్పుడు స్థూల శరీరం నిర్జీవమవుతుంది. శరీరాన్ని వదిలే ముందు వాక్కు మనస్సులో లీనమౌతుంది. చక్షురాది ఇంద్రియాలన్నీ మనస్సును చేరుతాయి. ఇంద్రియాలతో కూడిన మనస్సు ప్రాణంలో లీనమవుతుంది. ప్రాణం ఆత్మలో లీనమౌతుంది. ఈ విధంగా సూక్ష్మ శరీరం దేహాన్ని విడిచి ఆత్మను చేరి ఉంటుంది. మృత్యుకాలంలో జీవుడు సూక్ష్మ శరీరంతో పాటు చేసిన కర్మలతో కూడి దేహాన్ని వదలిపోతాడు. సూక్ష్మ శరీరం జీవునికి వాహకమవుతుంది. తదుపరి అది మరో స్థూల శరీరానికి కారణమవుతుంది కాబట్టి దానిని కారణ శరీరమంటారు. మన గత జన్మల పాప, పుణ్యాల ఫలితాలు, మునుపటి జీవితాల సంస్కారాలతో కూడి ఉన్న శరీరమది.

- జక్కని వేంకటరాజం, 9440021734

Updated Date - 2020-06-17T09:12:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising