ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శవపేటికను భద్రపరచు!

ABN, First Publish Date - 2020-02-02T04:43:29+05:30

ఒక రైతు వయసు పైబడడంతో పొలం పనులకు వెళ్లలేక ఇంటి దగ్గరే ఉంటున్నాడు. రోజంతా ఇంటి అరుగుపై కూర్చుంటున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక రైతు వయసు పైబడడంతో పొలం పనులకు వెళ్లలేక ఇంటి దగ్గరే ఉంటున్నాడు. రోజంతా ఇంటి అరుగుపై కూర్చుంటున్నాడు. ఆయన కొడుకు పొలం పనులు చక్కబెడుతున్నాడు. తండ్రి రోజూ అరుగుపై కూర్చుని ఉండటం గమనించిన అతడు ఒకరోజు ‘‘ఇక తండ్రి వల్ల ఏం ప్రయోజనం లేదని, ఏ పనీ చేయలేడని’’ అని మనసులో అనుకున్నాడు. ఒకరోజు విసుగు చెంది ఒక చెక్క శవపేటికను తయారుచేశాడు. దాన్ని తీసుకొచ్చి అందులో పడుకొమ్మని తండ్రితో అన్నాడు. తండ్రి మారు మాట్లాడకుండా అందులో పడుకున్నాడు. 

కొడుకు వెంటనే దాని మూత పెట్టేసి, కొండపైకి లాక్కుంటూ వెళ్లాడు. కొండపై నుంచి కిందకు తోసేద్దామనుకుంటున్న సమయంలో శపపేటికలో నుంచి వెలుతురు పడడం గమనించి మూత తీశాడు. అప్పుడు తండ్రి ప్రశాంతంగా కొడుకు వైపు చూస్తూ ‘‘నువ్వు నన్ను కొండపై నుంచి తోసేయాలని అనుకుంటున్నావని నాకు తెలుసు. అయితే దానికి ముందు నేనో సలహా ఇస్తాను’’ అని అన్నాడు తండ్రి. అప్పుడు కొడుకు ‘‘ఏంటది?’’ అని అడిగాడు. ‘‘నీకిష్టమైతే నన్ను కొండపై నుంచి తోసేయ్‌. కానీ ఈ చెక్క శవపేటికను దాచిపెట్టుకో. ఎందుకంటే ఇది భవిష్యత్తులో నీ పిల్లలకు ఉపయోగపడవచ్చు’’ అని అన్నాడు.

Updated Date - 2020-02-02T04:43:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising