ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సర్వాగమానామాచారః ప్రథమం పరికల్పతే ఆచార ప్రభవో ధర్మః ధర్మస్య ప్రభురచ్యుతః

ABN, First Publish Date - 2020-07-12T08:40:39+05:30

అన్ని ఆగమాలకంటే ముందుగా ఆచారం ఏర్పడింది. ఆచారం నుంచి ధర్మం పుట్టింది. ధర్మానికి ప్రభువు అచ్యుతుడు. ఆచరించడం వలన స్థిరపడింది ధర్మం. జీవితాన్ని ఉద్ధరించేది ధర్మం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అన్ని ఆగమాలకంటే ముందుగా ఆచారం ఏర్పడింది. ఆచారం నుంచి ధర్మం పుట్టింది. ధర్మానికి ప్రభువు అచ్యుతుడు. ఆచరించడం వలన స్థిరపడింది ధర్మం. జీవితాన్ని ఉద్ధరించేది ధర్మం. ధర్మం ఏ విధంగా ఉండాలో నిర్దేశించిన వాడు విష్ణువు కనుక ధర్మానికి ప్రభు వు విష్ణువే. భారతీయ జీవన విధానానికి పూర్వులు అద్భుతమైన ఆచారాలు ఏర్పరిచారు. ఉత్తమమైన జీవన విధానానికి ఏర్పరిచినవే షోడశ సంస్కారాలు. శిశువు పుట్టక ముందు 3.. పుట్టిన తర్వాత 13 సంస్కారాలు మనిషిని ఉత్తమమయిన మార్గంలో పయనింపజేసి, ముక్తిని పొందడానికి దోహదం చేస్తాయి. అవి..


గర్భాదానం: వివాహానంతరం సత్సంతానం కోసం నిర్వహించే పవిత్ర ఆచారం

పుంసవనం: గర్భస్థ శిశువు ఎదుగుదలకు ఈ సంస్కారం చేస్తారు

సీమంతోపనయనం: గర్భవతిని దుష్టశక్తులు చేరకుండా ఉండేందుకు ఈ సంస్కారం నిర్వహిస్తారు

జాతకర్మ: బలానికి, తెలివి తేటలకు ప్రతీకలయిన నెయ్యి, తేనెలను బిడ్డ చేత నాకించే కార్యక్రమం

నామకరణం: పిల్లలకు పేరు పెట్టే కార్యక్రమం. బాహ్య ప్రపంచంలో గుర్తింపుకే కాక వేద కర్మలకు ఇది అవసరం

నిష్క్రమణ: నిష్క్రమణమంటె బిడ్డను మొదటిసారిగా ఇంట్లోంచి బయటకు తీసుకురావడం. సాధారణంగా నాలుగో నెలలో బయటకు తీసుకువచ్చి సూర్య నమస్కారం చేయిస్తారు

ఉపవేశనం: బిడ్డ ఐదో నెలలో చంద్రోదయ సమయంలో చంద్రకాంతి శిశువుపై ప్రసరించే విధంగా కూర్చోబెట్టడం

అన్నప్రాశనం: శిశువుకు అన్నం తినిపించే కార్యక్రమం

చూడాకరణం: పుట్టు వెంట్రుకలు తీయించడం

కర్ణవేద: చెవులు కుట్టించి.. కర్ణాభరణాలు ధరింపజేసే కార్యక్రమం

అక్షరాభ్యాసం: అయిదు సంవత్సరాల లోపే చేసే క్రతువు ఇది. చిన్నారులతో అక్షరాలు దిద్దిస్తారు

ఉపనయనం: యజ్ఞోపవీత ధారణతో.. గాయత్రీ ఉపదేశంతో.. వేదాద్యాయానికి, బ్రహ్మచర్యాశ్రమానికి, యజ్ఞనిర్వహణకు ఈ సంస్కారం అధికారాన్ని కలిగిస్తుంది

ఉపాకర్మ: ఉపనయనం అయిన తర్వాత యజ్ఞొపవీతంతో కట్టిన జింక చర్మాన్ని వచ్చే శ్రావణ పౌర్ణమి నాడు సమంత్రకంగా తీసివేయడాన్ని ఉపాకర్మ అంటారు. ఈ కర్మ తర్వాత శాస్త్రాధ్యయనం ప్రారంభించవచ్చు

స్నాతకం: ఈ సంస్కారం బ్రహ్మచర్య వ్రతానికి చివరిదశ. విద్యాబుద్ధులు నేర్చుకోవడం పూర్తయిన సందర్భంలో.. ఇంటికి చేరుకునే ముందు గురుకులంలో నిర్వహిస్తారు. శిశ్యుడు బ్రహ్మవేత్త అవుతాడు. ఆ తర్వాత అతడు గృహస్థాశ్రమం లేదా సన్యాసాశ్రమం స్వీకరించవచ్చు

వివాహం: వివాహం ఒక ప్రధానమైన సంస్కారం. అన్ని ఆశ్రమాలకు మూలాధారం. ఇది సర్వోన్నతం

అంత్యేష్టి: మరణానంతరం జరిపే కర్మకాండ. ఇది చివరి సంస్కారం. వారసులు అతడి ఆత్మకు శాంతి, సద్గతులు కలగాలని నిర్వహించేది

- నోముల చంద్రశేఖర్‌, 98666 69859

Updated Date - 2020-07-12T08:40:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising