ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధీయానమే ధ్యానం

ABN, First Publish Date - 2020-10-28T07:22:53+05:30

మచ్చలేని, మాలిన్యం తెలియని ఆత్మకు మానవదేహంలో హృదయమే ఆరామస్థలి. కుడిరొమ్మున గుహ వలె ఉన్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మచ్చలేని, మాలిన్యం తెలియని ఆత్మకు మానవదేహంలో హృదయమే ఆరామస్థలి. కుడిరొమ్మున గుహ వలె ఉన్న ఖాళీ ప్రదేశమే అధ్యాత్మ హృదయం. దానిపై ఆలోచనను నిలిపి ధ్యానించాలి. మనసు, ధీశక్తి, ఇంద్రియాలు.. ఇవన్నీ అంతశ్చేతన ఆడించే ఆట వస్తువులే. చలనాలన్నీ ఆటలే. అవన్నీ వాస్తవంగా అనిపించే అవాస్తవాలు. లోచూపును గురించిన అవగాహన లేకపోవడమే దీనికి కారణం.

‘‘విపత్కర, దుస్త పరిణామాలకు లోనుకాక, ప్రపంచం పట్ల, అందరి యందు మైత్రీ భావం కలిగి, దుఃఖం తెలియని రీతి, నేను ధరించిన దేహాన్ని సైతం నాదిగా కాక ఇంకొకరిదిగా భావిస్తూ చూస్తూ ఉంటాను. వినిర్మల ఆకాశం వలె ఆశలకు అతీతంగా, ప్రశాంతంగా, నిత్య శాశ్వతంగా, అచలమహాస్థితిలో సంస్థితమై ఉంటాను. పంచ భూతాలు, మూడు అవస్థలు, నా దేహము శుద్ధచైతన్యమని నమ్ముతున్నాను. సర్వమూ నేనే. అతీతమూ నేనే. నేను అన్నిటా ఉన్నాను. అణువుకు, అణువుకు మధ్యన ఉన్న శూన్యాన్ని కూడా నేనే సత్‌ నుండి ఆవిర్భవించి చిత్‌గా నిలకడ చెందిన ఆనంద స్వరూపాన్ని నేను.




నాకు ఉత్థాన పతనాలు లేవు. అనంత మహాచైతన్యం నుంచి విడివడి ప్రపంచంలో తకొంతకాలం కూడి, ఆడి, కాల మహాకేళి ముగియగానే తిరిగి నా స్వస్థానంలోకి చేరుకుంటాను. నేను భ్రమించిన ఈ ప్రపంచం స్థితీ అదే. ఎందుకింత యాతన? ఎందుకింత ప్రయాస? నా స్థానం హృదయమన్న సత్యం అనుభవమవుతున్నప్పుడు జాగు చేయడం వృథా. ‘నేను అదే’ అన్న భావం స్థిరమవుతున్నది. మనోవృత్తులు, చిత్తవృత్తులు నశించి ఆత్మవృత్తులు నిలకడ చెందుతున్నాయి. దానివల్ల ఎవరి మీదా ఆధారపడని స్థితి కలుగుతుంది. ఇదే నిజమైన ఆనందం. అది పరమానంద ప్రదాయిని.’’ అనుకుంటేనే నిజమైన ఆనందం.

చేసేది ధ్యానం కాదు. ఏమీ చేయకపోవడమే ధ్యానం. ఆలోచనా ప్రవాహమే ధ్యానాన్ని సంపూర్ణానుభవంగా తీర్చిదిద్దుతుంది.

- వీఎస్‌ఆర్‌ మూర్తి, ఆధ్యాత్మిక శాస్త్రవేత్త


Updated Date - 2020-10-28T07:22:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising