ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేవుడు ఆలకిస్తాడు!

ABN, First Publish Date - 2020-04-03T06:32:12+05:30

మనం దేవుడిని తరచూ ప్రార్థిస్తూనే ఉంటాం. కానీ ప్రార్థన చేసినప్పుడు ఏం కోరుకుంటాం? ఉద్యోగాలు, ప్రమోషన్లు, పెట్టుబడుల మీద లాభాలు, కుటుంబ సంబంధమైన సమస్యలకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ధర్మపథం


మనం దేవుడిని తరచూ ప్రార్థిస్తూనే ఉంటాం. కానీ ప్రార్థన చేసినప్పుడు ఏం కోరుకుంటాం? ఉద్యోగాలు, ప్రమోషన్లు, పెట్టుబడుల మీద లాభాలు, కుటుంబ సంబంధమైన సమస్యలకు పరిష్కారాలు...! ఇవన్నీ వ్యక్తిగతమైనవే కదా! మనం కోరుకున్నవన్నీ దేవుడు తీర్చాలని ఆశిస్తాం. తీరుస్తాడని నమ్ముతూ ఉంటాం. మన అభీష్టాలకు అనుగుణంగా ప్రపంచం నడవాలని ఆశిస్తాం. అందుకోసం ఏవేవో మొక్కులు కడతాం. అంటే దేవుడితో వ్యాపార ఒప్పందం చేసుకుంటున్నాం. ఇలా ఆలోచించే వ్యక్తులకు దైవం పట్ల నిజమైన విశ్వాసం ఉండదు. ‘‘ఈ వ్యక్తులు నా దగ్గరకు వచ్చి పెదవుల అంచుల మీద ఉన్న మాటలతో నన్ను పొగుడుతూ ఉంటారు కానీ వారి హృదయం నా నుంచి దూరంగానే ఉంటుంది’’ అని ప్రభువు చెప్పారు. ఆ మాట అక్షరసత్యం. ఇలా స్వార్థం కోసం ఆలోచించి, దేవుణ్ణి ఉపకరణంగా చేసుకొని బాగుపడదామనుకొనే మనుషుల వల్లనే ప్రపంచానికి ఎక్కువ కీడు పొంచి ఉంది.

ఏమాత్రం విశ్వాసం లేని వారి కన్నా... ఒక వైపు ప్రకృతిని నాశనం చేస్తూ, మరోవైపు దైవాన్ని ప్రార్థించేవారే ప్రమాదకారులు. ప్రస్తుత కరోనా కల్లోల సమయంలో అధిక ధరలకు వస్తువులు అమ్మేవారి దగ్గర నుంచి ప్రజల్లో భయాందోళనలు రేపే వారి వరకూ... ప్రతి ఒక్కరూ మానవత్వానికి దూరంగా బతుకుతున్న వారే! వీరే సమాజానికి పెద్ద విపత్తు. ఇలాంటి సందర్భాలలో మన బాగు కోసం మాత్రమే కాదు, ప్రపంచం అంతా బాగుండాలనీ, మానవాళి ఈ పరిస్థితి నుంచీ కోలుకోవాలనీ, శాంతీ, ఆరోగ్యం విశ్వమంతటా వెల్లివిరియాలనీ దైవాన్ని కోరుకోవాలి. అదే నిజమైన ప్రార్థన. దేవుడు మన నుంచి ఆశించే అసలైన ప్రార్థన!! దేవుడు తప్పకుండా ఆలకించే ప్రార్థన!!

Updated Date - 2020-04-03T06:32:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising