ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సేవ చేసైనా జ్ఞానం పొందాలి!

ABN, First Publish Date - 2020-11-20T05:46:50+05:30

జ్ఞానులతో మాట్లాడి, వారిని ప్రశ్నలు అడిగి, వారికి సేవ చేసైనా వారి దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఈ విషయాన్ని భగవద్గీత నాలుగో అధ్యాయం, 34వ శ్లోకంలో శ్రీకృష్ణపరమాత్మ చెప్పాడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జ్ఞానులతో మాట్లాడి, వారిని ప్రశ్నలు అడిగి, వారికి సేవ చేసైనా వారి దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఈ విషయాన్ని భగవద్గీత నాలుగో అధ్యాయం, 34వ శ్లోకంలో శ్రీకృష్ణపరమాత్మ చెప్పాడు.


  • తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా
  • ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః


శ్రేష్టులను కలుసుకో, జ్ఞానం పెంచుకో! ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. వారినే ‘జ్ఞానులు’ అంటారు. వారి ద్వారా తెలుసుకోవాలి. అంతేకానీ వారి వ్యామోహంలో పడిపోకూడదు. గురువు ఫలానా వేషంలో అంటూ ఉండడు. సూటూ బూటూ వేసుకున్న వారిలో మహత్తరమైన జ్ఞానులు ఉన్నారు. పండితుల వేషంలో అజ్ఞానులు కూడా ఉన్నారు. ఇది వేషాన్ని బట్టి నిర్ణయించే వ్యవహారం కాదు. జ్ఞానులకు నమస్కారం చేయాల్సిందే! అందులో ఏ మార్పూ లేదు. అయితే అది సంప్రదాయంగా మారకూడదు. పిల్లల్లో భేదాభిప్రాయాలు ఉండకూడదనే యూనిఫామ్‌ డ్రెస్‌ పెట్టారు. అయినా కుల భేదాలు, మత భేదాలు, పేద, ధనిక తేడాలు పోలేదు. అంటే  యూనిఫామ్‌ కేవలం సాంకేతికమైంది. ఎటువంటి సంస్కారాన్ని కలిగించలేదు. అందుకే సాంకేతికమైనటువంటి పూజలు, దండాలు, సాష్టాంగ నమస్కారాలు ఎప్పటికప్పుడు తత్త్వ దర్శనంతో కలిసి సాగాలి. గురువును ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకోవాలి. జ్ఞానులకు సేవ చేయాలి. ‘పరమాత్మ, జీవాత్మ ఒక్కటే’ అని చెప్పే వాడు జ్ఞాని. ఇవి రెండూ వేరు అన్నాడంటే అజ్ఞానే. తత్త్వదర్శనం చేసిన జ్ఞాని దొరికితే వదిలిపెట్టకుండా, సేవ చేసైనా ఆయన చెప్పింది వినాలి. తెలుసుకోవాలనే ఆసక్తితో అడగాలి. 


- గరికిపాటి నరసింహారావు

Updated Date - 2020-11-20T05:46:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising