ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్నింటికన్నా జ్ఞానం గొప్పది!

ABN, First Publish Date - 2020-11-06T05:30:00+05:30

నోములు, వ్రతాలు చేస్తే సరిపోదు. నదీస్నానాలు చేయడం కాదు. వాటి ద్వారా జ్ఞానం పెంచుకునే ప్రయత్నం చేయాలి. అన్నింటి కన్నా జ్ఞానమే గొప్పది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నోములు, వ్రతాలు చేస్తే సరిపోదు. నదీస్నానాలు చేయడం కాదు. వాటి ద్వారా జ్ఞానం పెంచుకునే ప్రయత్నం చేయాలి. అన్నింటి కన్నా జ్ఞానమే గొప్పది. ఈ విషయాన్ని శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీత నాలుగో అధ్యాయం 33వ శ్లోకంలో చెప్పాడు. 


  • శ్రేయాన్‌ ద్రవ్యమయాద్యజ్ఞాత్‌ జ్ఞానయజ్ఞః పరంతప
  • సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే!


ఆధ్యాత్మిక ఆసక్తి కలిగిన వారందరూ జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఇది. ఎంతసేపూ పూజలు, పునస్కారాలు, గుళ్లూ, గోపురాలు, నదీస్నానాలు, వ్రతాలు, నోములు... వీటిలో మునిగిపోవడం కాదు. విగ్రహారాధన అనేది చిత్తశుద్ది కోసం మాత్రమే. అంతకు మించి ప్రయోజనం లేదు. ఆ చిత్తశుద్ది ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని నదుల్లో మునిగినా మనం ప్రయోజనం పొందలేకపోతున్నాం. అంటే మనం చేస్తున్న విధానంలో తేడా ఉంది. ‘‘నువ్వు ఎన్ని గుళ్లు గోపురాలు కట్టినా, ఎన్ని నదుల్లో స్నానం చేసినా, ఎన్ని నోములు, వ్రతాలు నోచినా, ఎన్ని యజ్ఞాలు, యాగాదులు చేసినా అన్నింటికన్నా జ్ఞానం గొప్పది. జ్ఞానం పెంచుకోవడమే ముఖ్యం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు భక్తి కంటే, యోగం కంటే, జ్ఞానం గొప్పదని స్పష్టంగా చెప్పాడు. ఏ పని చేస్తున్నా జ్ఞానంతో చేస్తున్నామా లేదా? నిస్వార్థంగా చేస్తున్నామా లేదా? అనేది పరిశీలించుకోవాలి.

-గరికిపాటి నరసింహారావు

Updated Date - 2020-11-06T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising