ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆనందం అక్కడే ఉంది!

ABN, First Publish Date - 2020-03-13T06:36:25+05:30

నిజమైన ఆనందం ఎక్కడ ఉంది? ఈ ప్రశ్నకు సమాధానాన్ని భగవద్గీత 3వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజమైన ఆనందం ఎక్కడ ఉంది? ఈ ప్రశ్నకు సమాధానాన్ని భగవద్గీత 3వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ వివరించాడు.


  • యస్త్వాత్మరతిరేవ స్యాత్‌ ఆత్మతృప్తశ్చ మానవః
  • ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే!

‘‘అర్జునా! ఏవో పనులు చేయడంలోనో, ఏదో సాధించడంలోనో, ఎవరి మెప్పో పొందడంలోనో, ఎవరితోనో పోట్లాడటంలో ఆనందం ఉందని అనుకుంటాం. అది చాలా పొరపాటు. బయట ఆనందం అంటూ ఏమీ లేదు. ఆనందం మనసులోనే ఉంటుంది. ఏకాంతంలోనే ఉంటుంది’’ అన్నాడు శ్రీకృష్ణపరమాత్మ. ఈ విషయం అర్థం చేసుకుంటే ఆనందం కోసం బయటకు వెళ్లే పనేలేదు. మన ఇంట్లోనే కూర్చుని ఆనందంగా ఉంటాం. 


మహాత్ముల లక్షణం!

కొంతమంది మహానుభావులు ఏకాంతంగా ఉండటానికి ఇష్టపడరు. తమకు తెలిసిన విషయాలను పదిమందికి చెబుతారు. అలా చేయడంలోనే ఆనందం పొందుతారు. రామకృష్ణపరమహంస, స్వామి వివేకానంద, జిడ్డుకృష్ణమూర్తి... ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది మహానుభావులున్నారు. ఈ విషయాన్ని భర్తృహరి సుభాషితాలను తెలుగులో అందించిన ఏనుగు లక్ష్మణ కవి పద్యం ద్వారా తెలుసుకుందాం.


హృదయవచశ్శరీరముల నెంతయు పుణ్యసుధాప్రపూర్ణులై/ ముదము బహూపకారముల మూడు జగంబులకు ఘటింపుచున్‌ / వదలక సాధుసద్గుణులవంబులు కొండలుజేసి మెచ్చుచున్‌ / మదిని వికాసయుక్తులగు మాన్యులు కొందరు వొల్తు రిద్ధరన్‌ మహానుభావుల మనస్సు అమృతం. వచస్సు అమృతం. వాళ్ల శరీరం నిండా అమృతమే. మనస్సు, మాట, చేత.. ఈ మూడింటిలో అమృతమే ఉంటుంది. కల్మషం కనిపించదు. వాళ్లకు ఈ లోకాన్ని బాగు చేయడం, అజ్ఞానాన్ని పోగొట్టడం తప్ప వేరే లక్ష్యం లేదు. వాళ్లకు కీర్తి, డబ్బు అవసరం లేదు. ఒక ప్రవక్త, తత్త్వవేత్త, జ్ఞాని లక్షణం ఏమిటంటే తోటి ప్రవక్తల సద్గుణాలను కొండంతలు చేసి మెచ్చుకుంటారు. అలాంటి వాళ్లు కొందరు ఉంటారు. వాళ్లకు నమస్కారం చేద్దాం!

- డా. గరికిపాటి నరసింహారావు

Updated Date - 2020-03-13T06:36:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising