ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అదే అసలు పరీక్ష!

ABN, First Publish Date - 2020-11-20T05:30:00+05:30

మానవుడికి జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతాయి. కొన్ని సులువుగా పరిష్కారమవుతాయి. మరికొన్ని సుదీర్ఘకాలం కొనసాగుతాయి. వాటిని దైవం పెట్టే పరీక్షలుగా భావించి, విశ్వాసంతో ముందుకు సాగడమే మానవుడు చేయాల్సిన పని. మనిషి తన ప్రమేయం లేని కొన్ని పరిస్థితుల్లో పుడతాడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మానవుడికి జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతాయి. కొన్ని సులువుగా పరిష్కారమవుతాయి. మరికొన్ని సుదీర్ఘకాలం కొనసాగుతాయి. వాటిని దైవం పెట్టే పరీక్షలుగా భావించి, విశ్వాసంతో ముందుకు సాగడమే మానవుడు చేయాల్సిన పని. మనిషి తన ప్రమేయం లేని కొన్ని పరిస్థితుల్లో పుడతాడు. తన నియంత్రణలో లేని పరిస్థితుల్లో జీవితం కొనసాగిస్తాడు. ఇదంతా భగవంతుడి సృష్టి ప్రణాళికలో భాగం.


‘‘విశ్వవ్యాప్తమైన నా ప్రణాళికను మానవుడు పూర్తిగా గ్రహించలేడు. నేను కలిమిలోనూ, లేమిలోనూ మిమ్మల్ని పరీక్షిస్తాను. ఆరోగ్యంలోనూ, అనారోగ్యంలోనూ, ఉత్థాన పతనాల్లోనూ పరీక్షిస్తాను. నా పరీక్షా విధానం మనిషి మనిషికీ మారుతుంది. గంట గంటకూ మారుతుంది’’ అని దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ స్పష్టం చేశాడు. అందుకే లేమిలో కుంగిపోయి అధర్మ మార్గాలలో పడవద్దనీ, అలాగే మధ్యలో వచ్చే కలిమికి గర్వపడి దైవాన్ని మరువవద్దనీ హెచ్చరించాడు. 

మానవులకు దైవం ఇచ్చిన జీవితం తాత్కాలికం. ప్రతి నిత్యం ఆయన పరీక్షలోనే మానవులు ఉంటారు. ప్రతి క్షణం ఆ పరీక్షలోనే గడపాల్సి ఉంటుంది. అందుకే దైవం ఆదేశాల మేరకు జీవించాలి. ఐహిక జీవితమే అంతిమమని ఆలోచించేవారు సత్యాన్ని తెలుసుకోలేరు. మరణం తరువాత మరో జీవితం ఉంది. అదే శాశ్వతం. అది అసలైన సత్యాన్ని బహిర్గతపరిచే ద్వారం. ఆ ద్వారాన్ని చేరుకొని, సత్యాన్ని తెలుసుకొనే అర్హత సాధించడమే అసలైన పరీక్ష.

- మహమ్మద్‌ వహీదుద్దీన్‌

Updated Date - 2020-11-20T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising