ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎవరు సజ్జనులు?

ABN, First Publish Date - 2020-02-07T06:22:00+05:30

పని ప్రారంభించి మధ్యలో వదిలిపెట్టడం తప్పే. దాని గురించి భర్తృహరి సుభాషితాలను తెలుగులో అందించిన ఏనుగు లక్ష్మణకవి పద్యం ద్వారా తెలుసుకుందాం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పని ప్రారంభించి మధ్యలో వదిలిపెట్టడం తప్పే. దాని గురించి భర్తృహరి సుభాషితాలను తెలుగులో అందించిన ఏనుగు లక్ష్మణకవి పద్యం ద్వారా తెలుసుకుందాం.

తమ కార్యంబు బరిత్యజించియు బరార్థ ప్రాపకుల్‌ సజ్జనుల్‌
తమ కార్యంబు ఘటించుచున్‌ బరహితార్థ వ్యాపృతుల్‌ మధ్యముల్‌
తమకై యన్య హితార్థ ఘాతుక జనుల్‌ దైత్యుల్‌, వృధాన్యార్థభం
గము గావించెడువార లెవ్వరొ యెఱుంగ శక్యమే యేరికన్‌

ఎటువంటి వాళ్లు సజ్జనులు? ఎటువంటి వాళ్లు మధ్యములు? ఎటువంటి వాళ్లు నీచులు? కొందరు అవసరమైతే తమ పని పక్కన పెట్టి ఎదుటి వాళ్ల పని చేస్తారు. వాళ్లు సజ్జనులు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు ఇతరుల పనులను పూర్తి చేయడం పైనే దృష్టి పెడుతుంటారు. వాళ్ల సొంతపనుల గురించి ఆలోచించరు. అటువంటి వాళ్లు సజ్జనులు. కొంతమంది ఇతరుల పని చేస్తూ, వాళ్ల పని కూడా చేసుకుంటుంటారు. వాళ్లు మధ్యములు. వీళ్లు ఆఫీసు పని పూర్తి చేస్తూ, మధ్యమధ్యలో తమ సొంత పని కూడా చక్కబెట్టుకుంటారు. ఇక చివరగా కొందరు తమ ప్రయోజనాల కోసం ఇతరుల పనులన్నీ పక్కన పెడతారు. వాళ్లు నీచులు. ఆఫీసులో కూడా తమ సొంత పనుల గురించే ఆలోచిస్తుంటారు. మనం ఆ కోవకు చెందకుండా ఉండటం చాలా అవసరం.
డా. గరికిపాటి నరసింహారావు

Updated Date - 2020-02-07T06:22:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising