ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశ్వాసం చిగర్చాలి!

ABN, First Publish Date - 2020-08-07T05:30:00+05:30

ఒక వ్యక్తి తన ద్రాక్ష తోటలో అంజీర్‌ మొక్క నాటాడు. అది చెట్టు అయ్యింది కానీ, పండ్లేవీ కాయడం లేదు. తన తోట కాపలావాణ్ణి అతను పిలిచి, ‘‘ఈ అంజీర్‌ చెట్టు కాస్తుందేమోనని మూడేళ్ళ బట్టి చూస్తున్నాను. ఏమాత్రం ఫలితం కనబడడం లేదు. ఇది నేలలో ఉండి ఉపయోగం లేదు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక వ్యక్తి తన ద్రాక్ష తోటలో అంజీర్‌ మొక్క నాటాడు. అది చెట్టు అయ్యింది కానీ, పండ్లేవీ కాయడం లేదు. తన తోట కాపలావాణ్ణి అతను పిలిచి, ‘‘ఈ అంజీర్‌ చెట్టు కాస్తుందేమోనని మూడేళ్ళ బట్టి చూస్తున్నాను. ఏమాత్రం ఫలితం కనబడడం లేదు. ఇది నేలలో ఉండి ఉపయోగం లేదు. దీన్ని నరికెయ్‌!’’ అని చెప్పాడు. అప్పుడు ఆ కాపలాదారు ‘‘మరో ఏడాది చూద్దాం, నేను దాని చుట్టూ తవ్వి, ఎరువులు వేస్తాను. అది పండ్లు కాస్తే సరే, లేదంటే అప్పుడే నరికెయ్య వచ్చు’’ అన్నాడు. ఏసు క్రీస్తు చెప్పిన కథ ఇది. 

 

ఆ ద్రాక్ష తోట యజమాని దైవం. ‘లోకం’ అనే తోటలో ‘మంచి విశ్వాసం’ అనే ఫలాలను ఆయన ఆశిస్తాడు. లోకంలోని మానవుల్లో విశ్వాసాన్ని పాదుగొలిపి, వారిని మంచి ఫలాల్లాంటి వ్యక్తులుగా చేసే తోటమాలి ఏసు క్రీస్తు. దైవం పట్ల విశ్వాసం పెంచుకోని వ్యక్తులు పండ్లు కాయని చెట్టు లాంటివారు. వారికి శిక్ష ఉండాలన్నది దైవం భావన. కానీ ‘మానవ హృదయం’ అనే నేలలో ఏదైనా అద్భుతం జరగవచ్చు. విశ్వాసం చిగుర్లు తొడగవచ్చు. దాని కోసం మరికొంత కాలం ప్రయత్నించాలన్నది తోటమాలిగా ఏసు ప్రభువు సంకల్పం. సువార్తను వ్యాప్తి చేసేవారు కూడా ఇదే సంకల్పంతో మరింత కృషి చేయాలని ఆయన అన్యాపదేశంగా సూచించాడు. దైవం ఇచ్చిన జీవితాన్ని విశ్వాసరహితంగా వ్యర్థం చేసుకుంటే చివరకు విచారించక తప్పదు. దైవాగ్రహాన్ని చవిచూడక ముందే విశ్వాసం చిగురించాలన్నది క్రీస్తు సందేశం.

Updated Date - 2020-08-07T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising