ఆరోగ్యం కోసం...
ABN, First Publish Date - 2020-04-17T05:17:09+05:30
‘ఆరోగ్యమ్ భాస్కరాదిచ్ఛేత్’- ఆరోగ్య ప్రదాత భాస్కరుడు. ఆ సూర్యభగవానుడి అనుగ్రహం ఉంటే అనారోగ్యం దరి చేరదంటారు.
‘ఆరోగ్యమ్ భాస్కరాదిచ్ఛేత్’- ఆరోగ్య ప్రదాత భాస్కరుడు.
ఆ సూర్యభగవానుడి అనుగ్రహం ఉంటే
అనారోగ్యం దరి చేరదంటారు.
లోకాన్ని ఒక అంటువ్యాధి కల్లోలపరుస్తున్న విషమకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికీ, మృత్యుభయాన్ని పోగొట్టుకోవడానికీ ధర్మ, మంత్ర శాస్త్రాలు కొన్ని విధులు చెప్పాయి. తెలుగువారికి ఎంతో గౌరవప్రదమైన తమిళనాడులోని ప్రసిద్ధ కుర్తాళం పీఠం అధిపతి జగద్గురు శంకరాచార్య శ్రీసిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి ఈ కరోనా వేళ సూచించిన స్తోత్రాలు, ప్రత్యేక పద్ధతులు...
సంకల్పం
గణపతినీ, గురువునూ, ఇష్ట దేవతనూ తలచుకోవాలి.
‘ప్రపంచస్య కరోనా వ్యాధి నిర్మూలనార్థం, సర్వ మానవానాం రక్షణార్థం, ఆయురారోగ్య సిద్ధ్యర్థం ఆదిత్య హృదయ, ద్వాదశ నామ పారాయణం, మహా మృత్యుంజయ బీజ సహిత సూర్య మంత్ర (జపం/హోమం/తర్పణం) చ కరిష్యే’ అని సంకల్పం చెప్పుకోవాలి.
1. ‘ఆదిత్యహృదయ పారాయణం కరిష్యే’ అని ప్రారంభించి ‘ఆదిత్య హృదయం’ పారాయణ చేయాలి.
2. తరువాత ‘ద్వాదశ సూర్య నామావళి పారాయణం కరిష్యే’ అని చెప్పి, ‘ద్వాదశ సూర్య నామావళి’ పారాయణ చేయాలి.
ద్వాదశ సూర్య నామావళి
ఓం హ్రాం మిత్రాయ నమః
ఓం హ్రాం రవయే నమః
ఓం హ్రాం సూర్యాయ నమః
ఓం హ్రాం భానవే నమః
ఓం హ్రాం ఖగాయ నమః
ఓం హ్రాం పూష్ణే నమః
ఓం హ్రాం హిరణ్యగర్భాయ నమః
ఓం హ్రాం మరీచయే నమః
ఓం హ్రాం ఆదిత్యాయ నమః
ఓం హ్రాం సవిత్రే నమః
ఓం హ్రాం అర్కాయ నమః
ఓం హ్రాం భాస్కరాయ నమః
3. మహా మృత్యుంజయ మంత్రం
అనంతరం ‘మహా మృత్యుంజయ బీజ సహిత సూర్య మంత్ర (జపం/హోమం/తర్పణం) కరిష్యే’ అని చెప్పాలి.
మంత్రం: ‘ఓం జూం సః మార్తాండాయ రక్ష రక్ష, రోగం నాశయ నాశయ, ఆరోగ్యం దేహి దేహి హ్రాం సూర్యాయ నమః’
జప మాల: స్ఫటిక మాలతో లేదా గోదుమ గింజలతో జపం చేయవచ్చు
జపం ఎన్ని సార్లు?: యథాశక్తి (కనీసం 108 సార్లు)
హోమం వేటితో చేయాలి?: గోదుమలు, ఆవు నెయ్యి హోమంలో వేస్తూ ఉండాలి. పైన పేర్కొన్న మంత్రం పఠిస్తూ చివర్లో ‘స్వాహా’ అనాలి.
తర్పణం దేనితో చేయాలి?: పాలు, ఎర్ర చందనం నీళ్ళు తర్పణం వదలాలి. పై మంత్రం పఠిస్తూ ‘సూర్యం తర్పయామి నమః’ అని చెప్పాలి.
సమర్పణ ఇలా చేయాలి: ‘మయాకృత ఆదిత్య సాధన ఫలితం సర్వం ప్రపంచస్య కరోనా వ్యాధి నిర్మూలనార్థం, సర్వ మానవానాం రక్షణార్థం, ఆయురారోగ్య సిద్ధ్యర్థం సూర్య దేవతాయైు సమర్పయామి’ అని చెప్పాలి. సమర్పణ నీటితో చేయాలి. ఆ నీటిని తీర్థంగా తీసుకొని, మిగిలినది చెట్లలో పోయవచ్చు.
4. అనారోగ్య నివారణ కోసం ప్రత్యేక పద్ధతులు
ఎ) గోదుమలతో...
ఒక చిన్న పాత్రలో పిడికెడు గోదుమలు తీసుకోవాలి. అందులో కుంకుమ, నెయ్యి కలిపి, వాటిని తాకి, పైన చెప్పిన మంత్రాన్ని (మహా మృత్యుంజయ బీజ సహిత సూర్య మంత్రం) 12 సార్లు జపించాలి. అనంతరం ఆ పాత్రను చేతితో పట్టుకొని, జపం చేసిన వారు మూడుసార్లు తమ ముఖం ముందు తిప్పాలి. ఎవరూ తొక్కని చోట పడెయ్యాలి. గోదుమలు ఉన్న పాత్రను ముఖం ముందర తిప్పుకొనేటప్పుడు కుడి వైపు నుంచి ఎడమ వైపు లేదా ఎడమ వైపు నుంచి కుడివైపు... ఎలాగైనా తిప్పవచ్చు.
ఈ ప్రక్రియను పగటి పూటైనా, రాత్రయినా చెయ్యవచ్చు.
బి) పసుపు నీటితో...
చిన్న పాత్రను పసుపు నీటితో నింపి, ఆ నీటిని తాకి, పైన చెప్పిన మంత్రాన్ని (మహా మృత్యుంజయ బీజ సహిత సూర్య మంత్రం) 12 సార్లు ఉచ్చరించి, సూర్యకిరణాలు ఆ నీటిపై పడేలా కొద్ది క్షణాలు ఉంచాలి. అనంతరం మంత్రాన్ని జపిస్తూ
ఆ నీళ్ళను ఇంట్లో, ఇంటి పరిసరాల్లో చల్లుకోవాలి.
పైన పేర్కొన్న విధంగా చేయడం వల్ల సూర్యుడి అనుగ్రహం లభిస్తుంది. త్వరగా ఆరోగ్యం చేకూరుతుంది.
సర్వ వ్యాధి నివారణ కోసం
ఆదిత్య హృదయం,
మృత్యుభయం తొలగిపోవడానికి
మహా మృత్యుంజయ మంత్రం పఠిస్తే ఆశించిన ఫలితాలు,
దైవ కృప లభిస్తాయని
పెద్దల మాట.
శ్రీసిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి
Updated Date - 2020-04-17T05:17:09+05:30 IST