ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తూర్పులో తొలి తిరుపతి!

ABN, First Publish Date - 2020-10-09T07:39:00+05:30

తిరుపతి (తిరుమల), చిన్న తిరుపతి (ద్వారకా తిరుమల) ... ఈ క్షేత్రాలు ఎక్కడున్నాయో, వాటి ప్రాశస్థ్యం ఏమిటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే వాటి స్థాయిలో ప్రాచుర్యం పొందని మరో తిరుపతి కూడా ఉంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి (తిరుమల), చిన్న తిరుపతి (ద్వారకా తిరుమల) ... ఈ క్షేత్రాలు ఎక్కడున్నాయో, వాటి ప్రాశస్థ్యం ఏమిటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే వాటి స్థాయిలో ప్రాచుర్యం పొందని మరో తిరుపతి కూడా ఉంది. అదే తొలి తిరుపతి... శ్రీ శృంగార వల్లభ స్వామిగా శ్రీ మహవిష్ణువు వెలసిన పురాతన పుణ్యక్షేత్రం. 


శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల దేశంలోని ప్రాచీన ఆలయాల్లో ఒకటి. అయితే తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు సుమారు 10 కి.మీ. దూరంలో ఉన్న తొలి తిరుపతి అంతకన్నా పురాతనమైనదని చెబుతారు. ఈ ఆలయంలో విష్ణుమూర్తి శిలారూపంలో దర్శనమిస్తాడు. తొలుత విష్ణువు వెలసిన చోటు ఇదే కనుక దీనికి ‘తొలి తిరుపతి’గా పేరు వచ్చిందనీ స్థానికుల కథనం.




స్థల పురాణం ప్రకారం... రాజైన ఉత్థానపాదుడికి ఇద్దరు భార్యలు. రెండో భార్య కుమారుడు ఉత్తముడు తండ్రి ఒడిలో కూర్చొని ఉండగా, మొదటి భార్య కుమారుడు ధ్రువుడు కూడా వచ్చి తండ్రి ఒడిలో చేరబోతాడు. అతణ్ణి సవతి తల్లి పక్కకు నెడుతుంది. ఆవేదన చెందిన ధ్రువుడు తల్లి సూచన మేరకు విష్ణుమూర్తి కోసం తపస్సు చేస్తాడు. విష్ణువు ప్రత్యక్షమవగా, బ్రహ్మాండమైన ఆయన దివ్య తేజస్సును చూసి ధ్రువుడికి భయం వేస్తుంది. అతణ్ణి బుజ్జగించే సమయంలో విష్ణుమూర్తి శంఖ చక్రాలు చేతులు మారుతాయి. ధ్రువుడి కోసం తన రూపాన్ని చిన్నదిగా చేసుకొని, చిరునవ్వుతో కటాక్షిస్తాడు. తారామండలంలో నక్షత్రంగా నిలిచిపోతావని దీవిస్తాడు. శ్రీ శృంగార వల్లభ స్వామిగా శిలా రూపంలో ఆ క్షేత్రంలో నిలిచిపోతాడు. తనను దర్శించిన వారికి వారి ఎత్తులోనే కనిపిస్తాననీ వాగ్దానం చేస్తాడు. ఆయనకు దేవతలే ఆలయాన్ని నిర్మించారనీ, మహాలక్ష్మిని నారదుడు ప్రతిష్ఠించాడనీ స్థల పురాణం వివరిస్తోంది.. శ్రీ శృంగార వల్లభ స్వామిని పూజిస్తే పిల్లలు లేనివారికి సంతానం కలుగుతుందనే విశ్వాసం ఉంది. 

Updated Date - 2020-10-09T07:39:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising