ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లోపలున్నదే బయట వ్యక్తం అవుతుంది!

ABN, First Publish Date - 2020-06-15T09:43:16+05:30

కుండ నిండా నీళ్లున్నప్పుడు అది తొణికినప్పుడల్లా నీళ్లు బయటకు వస్తాయి. అలాగే హృదయం నిండా భగవత్తత్వం నిండి ఉంటే మనం మాట్లాడే ప్రతి మాటలో అది బహిర్గతమవుతుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కుండ నిండా నీళ్లున్నప్పుడు అది తొణికినప్పుడల్లా నీళ్లు బయటకు వస్తాయి. అలాగే హృదయం నిండా భగవత్తత్వం నిండి ఉంటే మనం మాట్లాడే ప్రతి మాటలో అది బహిర్గతమవుతుంది. భగవత్తత్వం పరమ ప్రేమ స్వరూపం. అది కల్మషాలు లేని గంగాజలం వంటిది. అంతర్గత తత్వం నిండా అది నింపేందుకు అనేక సాధనలను మన శాస్ర్తాలు సూచించాయి. స్తుతి, ఆర్తి, విన్నపం, అభ్యర్థన అనేవి భక్తి మార్గంలో నామోచ్ఛారణకు వస్తువులుగా చెప్పారు. ఈ నాలుగు శరణాగతమార్గాన్ని సూచిస్తాయి. రూపగుణలీలా విలాసాల వర్ణనను సామాన్యులు సైతం భక్తి శిఖరాన్ని అందుకోవడం కోసం ‘సంకీర్తన’ దోహదపడుతోంది. అదీ భక్తిలో భాగమే కాబట్టి అదంతా భగవత్తత్వ వ్యక్తీకరణే. భక్తి అంటేనే ‘భజ్‌సేవాయాం’ అని నిర్వచనం. ఇది క్రియారూపం. ఈ భక్తి విషయంలో శైవం శాండిల్యుడిని అనుసరించగా, వైష్ణవం నారదుని ఎక్కువగా అనుసరించినట్లు తెలుస్తోంది. ఇది గీతలో వ్యక్తి యొక్క గుణాలననుసరించి సాత్విక, రాజస, తామస రూపాలుగా చెప్పబడింది. ఉపచారరూపంలో ఇది శ్రవణం, కీర్తనం అనే తొమ్మిది విధాలుగా కన్పిస్తుంది.


‘‘సంవిదితం సంవిదితం సంవిన్మయమేవ భవతి సంవేద్యమ్‌

అగ్నివాహిత మాహితమగ్నిమయం కిన్నజాయతౌ కాష్ఠమ్‌’’


బాగుగా ఆత్మలో పరమాత్మ భావన చేస్తూపోగా అంతా పరమాత్మమయమే అవుతుంది. అగ్నిలో హోమం చేసిన వస్తు సంచాయమంతా అగ్నిరూపంలోనే ఉంటాయి. మనం మనస్సు నిండా ఆత్మభావననే నింపుకొన్నప్పుడు దాని స్వరూపాలైన ప్రేమ, దయ, కరుణను మన అంతరంగం నిండా దర్శించవచ్చు. మనలో ఏ వస్తువులు సర్వం నిండి ఉంటాయో అవే లౌకిక, అలౌకిక జీవితంలో వ్యక్తం అవుతంటాయి. ‘‘పెనుగాలి వీచే ముందు వీధిలోని ఆకు గాలి వీచే దిశను బట్టి కొన్ని సమయాల్లో మంచి ప్రదేశాలకు, మరికొన్ని సందర్భాల్లో మురికి కూపంలోకి కొట్టుకొని పోతుంది’’ అంటారు శ్రీరామకృష్ణులు. ఈ రెండు దిశల్లో శుద్ధజీవనంవైపే ప్రయాణం చేసే మార్గాన్ని భగవద్భక్తులు ఎంచుకోవాలి. భౌతిక జీవనంలో నైతికత, ఆధ్యాత్మిక జీవనంలో సార్థకత కలిగి ఉండాలి.


‘‘అంతరంగము నందు నిండిన ఆత్మరాములగానలేకను

అంతుదెలియని మోహమందున సంచరింతురు మూర్ఖజనులు’’


అంటాడు ఓ తత్వవేత్త. లోపలున్న అవలక్షణాలను ఆవలకు తోసేస్తే.. అంతర్బహిశ్చ తత్వంలో అమరి ఉన్న నారాయణ తత్వం దానంతకదే బయటకువస్తుంది. ఎలాగైతే ఒక రాతిలోని అవసరం లేని ముక్కల్ని తొలగించగానే అందులోని విగ్రహం బయట పడుతుందో.. మనలోని అమూర్త వ్యర్థాలను సాధనతో బయటకు పంపాలి. అపుడు లోపలున్న అసలు తత్వం బయల్పడుతుంది.


 డా. పి.భాస్కరయోగి

Updated Date - 2020-06-15T09:43:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising