ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏవి చెయ్యాలి? వేటిని వదలాలి?

ABN, First Publish Date - 2020-11-06T05:30:00+05:30

‘ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా, నీతిని విడిచిపెట్టకుండా, దైవాన్ని మరువకుండా, నిజాయతీగా జీవితాన్ని గడపడమే మానవ జన్మ పరమార్థం’ అని అన్ని ధర్మాలూ చెబుతాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా, నీతిని విడిచిపెట్టకుండా, దైవాన్ని మరువకుండా, నిజాయతీగా జీవితాన్ని గడపడమే మానవ జన్మ పరమార్థం’ అని అన్ని ధర్మాలూ చెబుతాయి. అలాంటి జీవించినవారు సంతోషంగా ఉంటారు. మనుషులు ఏవి పాటించాలో, వేటిని విడిచిపెట్టాలో ఇస్లాం గ్రంథాలు మార్గనిర్దేశం చేశాయి. 


  1. రాత్రి సమయాల్లో లేచి ఆరాధన చేయడం, చేసిన పాపాలకు పశ్చాత్తాపం చెందడం, అధికంగా దానం చేస్తూ ఉండడం, దైవ నామస్మరణలో గడపడం... వీటివల్ల మనిషి సంతోషంగా ఉంటాడు. అతనికి దైవానుగ్రహం లభిస్తుంది. 
  2. అబద్ధాలు చెప్పేవారికీ, వడ్డీ మీద బతికేవారికీ, ఇతరులను గౌరవించనివారికీ, చెడ్డ విషయాల కోసం పట్టుపట్టేవారికీ ముఖ వర్చస్సు తగ్గిపోతుంది. సమాజంలో గౌరవం ఉండదు. 
  3. అతిగా మాట్లాడే వారూ, ఎక్కువగా నిద్రపోయేవారూ, మితిమీరి తినేవారూ, ఎక్కువమందిని కలుస్తూ ఉండేవారూ ఆందోళనకూ, అనారోగ్యానికీ గురవుతారు. 
  4. ఆందోళన, క్రుంగుబాటు, ఆకలి, ఆలస్యంగా నిద్రపోవడం... వీటివల్ల మనుషులు బలహీనులైపోతారు.
  5. నమాజ్‌ చేయనివారికీ, చేసినా క్రమం తప్పకుండా చెయ్యని వారికీ, అలసత్వంతో ఉండేవారికీ, ఇతరులను మోసగించేవారికీ దైవానుగ్రహం ఉండదు.

అందుకే సదా దైవచింతనలో ఉండాలి. ఇతరులకు సాయం చేస్తూ ఉండాలి. చెడ్డ విషయాలకూ, దురలవాట్లకూ, బద్ధకానికీ దూరంగా ఉండాలి. వీటిని పాటించేవారు లోకానికి ఆదర్శంగా ఉంటారు. దైవానికి ప్రీతిపాత్రులవుతారు.


- మహమ్మద్‌ వహీదుద్దీన్‌


Updated Date - 2020-11-06T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising