ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దైవ చింతనతో కోరికలు దగ్ధం

ABN, First Publish Date - 2020-07-28T08:30:54+05:30

చంపారణ్య ప్రాంతంలో హిరణ్యపురం అనే చిన్న రాజ్యం. దాని రాజు భాస్కరవర్మ. అతడి పాలనా చాతుర్యం వల్ల ప్రజలందరూ సుఖశాంతులతో జీవిస్తున్నారు. ఆ రాజ్యం శత్రుదుర్భేద్యం ఏమీ కాదుగానీ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చంపారణ్య ప్రాంతంలో హిరణ్యపురం అనే చిన్న రాజ్యం. దాని రాజు భాస్కరవర్మ. అతడి పాలనా చాతుర్యం వల్ల  ప్రజలందరూ సుఖశాంతులతో జీవిస్తున్నారు. ఆ రాజ్యం శత్రుదుర్భేద్యం ఏమీ కాదుగానీ.. ఆ రాజ్యం చుట్టూ ఉన్న రాజులందరితో భాస్కరవర్మ స్నేహభావంతో ఉండటం వల్ల వారూ అలాగే ఉండేవారు. భాస్కరునికి తమ రాజ్యపు పురాతన సంస్కృతీ సంప్రదాయాలంటే ఎంతో శ్రద్ధ. అతని ప్రజలకూ అంతే. గొప్ప పర్యాటక క్షేత్రంగా ప్రసిద్ధిచెందిన హిరణ్యపురంలో ఉన్న అతిపురాతన దేవాలయాలకు అన్ని రాజ్యాల నుంచి ప్రజలు తండోపతండాలుగా వచ్చి దర్శించుకునేవారు. దీనివల్ల ఆ రాజ్య ఆదాయం బాగా పెరిగింది. హిరణ్యపురానికి ఉత్తరాన ఉన్న ఒక మిత్రరాజ్యానికి అవతల మహాకిరాత రాజ్యం ఉంది. అక్కడ ఉన్నరాజుకి, ప్రజలకూ కూడా పొరుగు రాజ్యాల మీద పడి దోచుకుతినడమే అలవాటు. పేరుకు రాజరికం అయినా.. అక్కడి ప్రజలు రాజు మాట వినరు.


అందరికీ తెలిసిన విద్య ఒక్కటే. దోచుకుతినడం. దాచుకు తినడం తెలియదు. అంతేగాక పక్కరాజ్యాల్లో కృత్రిమమైన ఈతిబాధలను సృష్టించడం  కూడా వాళ్లకు తెలిసిన విద్యలలో ఒకటి. హిరణ్యపురం సంపన్నరాజ్యం అవటం వల్ల వారు దానిమీద కన్ను వేశారు. ముందుగా ఒక పథకం ప్రకారం తమకు హిరణ్యపురానికి మధ్యన ఉన్న చిన్న రాజ్యాన్ని కబళించడానికి ఒక పన్నాగం పన్ని.. లక్షలాది మిడతలను .  ఆ రాజ్యం మీదకు వదిలారు. పంటలన్నీ  నాశనమైపోతున్న తరుణంలో ఆ మిత్రరాజ్యపు రాజు భాస్కరునికి వర్తమానం పంపాడు. భాస్కరునికి కిరాతకుల పన్నాగం అర్థమైంది. వెంటనే రాజగురువు దగ్గరకు సలహా కోసం వెళ్లాడు. రాజగురువు ఒక్కనిముషం ఆలోచించి.. ‘‘అతివృష్టి, అనావృష్టి, మిడతలు, ఎలుకలు, పక్షులు, పొరుగున ఉండే దుష్టరాజులు.. ఈ ఆరు కారణాల వల్ల ఏర్పడే కష్టాలకు ఈతి బాధలని పేరు. ఈ కష్టాలలో ఒక్కొక్క కష్టానికి ఒక్కొక్క విధమైన పరిష్కారం ఉన్నది.  మిడతల సమస్యకు ఒక పరిష్కారం ఉంది. మీ చుట్టుపక్కల రాజ్యాల వారందరితో సంప్రదించి నే చెప్పినట్టు చెయ్యండి’’ అని ఒక ఉపాయం చెప్పాడు. దాని ప్రకారం రాజులందరినీ కూడగట్టిన భాస్కరుడు.. ‘‘మనం మన రాజ్యాల చుట్టూ, పంటపొలాల చుట్టూ తగినంతదూరంలో కంచెలను వేసి  జ్వాలాతోరణాలను వెలిగించాలి. ఇలా ఒక వారం రోజులు చెయ్యండి. అలాగే జ్వాలామాలినీ దేవిని ఉపాసించండి’ అని చెప్పాడు. రాజులందరూ భాస్కరుడు చెప్పిన విధంగా చేశారు. ఆ రాజ్యాల వైపు వచ్చిన మిడతలన్నీ ఆ జ్వాలాతోరణాల్లో పడి దగ్ధమయ్యాయి. అనూహ్యంగా పగటి సమయాలలో పంటచేలల్లోకి లెక్కలేనన్ని తొండలు వచ్చి ఒక్క మిడుతను కూడా మిగలనివ్వకుండా మింగేశాయి. ఆ తరువాత భాస్కరుడు మిత్రరాజులందరినీ కూడగట్టుకుని కిరాతదేశం మీద దండెత్తి ఆ రాజ్యాన్ని జయించాడు.


రాజగురువుకు జరిగింది విన్నవించి.. ‘‘ఆ తొండలు ఎక్కడినుంచి వచ్చాయి?’’ అని అడిగాడు. ‘‘మిడతలకు శత్రువులు అగ్ని, తొండలు.  మీరందరూ జపించిన జ్వాలామాలినీ మంత్రప్రభావమది.  అది కేవలం భౌతికమైన రక్షణను ఇవ్వడమే కాదు. మిడతల దండులాగా మనిషిని ముసురుకునే కోరికలను పారద్రోలి ఆధ్యాత్మిక వికాసాన్ని సాధించడానికి కూడా జ్వాలామాలినీ ఉపాసన ఉపకరిస్తుంది’’ అని చెపాడు. గురువుకు నమస్కరించి నగరం వైపుకు బయల్దేరాడు రాజు. మనం నమ్మిన దైవచింతన చేసుకుంటే మనో బలం పెరుగుతుంది. మిడతల దండువలే ఆవరించే కోరికలు జ్ఞానాగ్ని వల్ల దహింపబడతాయి. వాటివల్ల మనలోని ఆటవికతత్వం అంతరిస్తుంది.


- ఆచార్య రాణి సదాశివ మూర్తి

Updated Date - 2020-07-28T08:30:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising