ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గురువు ఎదురుచూపు

ABN, First Publish Date - 2020-11-20T05:30:00+05:30

జెన్‌ గురువుల తీరు, వారు ప్రవర్తించే ధోరణి విచిత్రంగా ఉంటుంది. అందరిలోనూ బోధిధర్మ అత్యంత వింతైన గురువు. సాధారణంగా ధర్మ ప్రవచనాలు చేసేవారు ప్రేక్షకుల వైపు చూస్తూ మాట్లాడతారు. ఆ చివర నుంచి ఈ చివరి వరకూ ఉన్న వారిని ఉద్దేశిస్తున్నట్టు ముఖాన్ని అటూ ఇటూ తిప్పుతూ ప్రసంగిస్తారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జెన్‌ గురువుల తీరు, వారు ప్రవర్తించే ధోరణి విచిత్రంగా ఉంటుంది. అందరిలోనూ బోధిధర్మ అత్యంత వింతైన గురువు. సాధారణంగా ధర్మ ప్రవచనాలు చేసేవారు ప్రేక్షకుల వైపు చూస్తూ మాట్లాడతారు. ఆ చివర నుంచి ఈ చివరి వరకూ ఉన్న వారిని ఉద్దేశిస్తున్నట్టు ముఖాన్ని అటూ ఇటూ తిప్పుతూ ప్రసంగిస్తారు. బోధి ధర్మ ఉపన్యాస పద్ధతి దీనికి పూర్తి భిన్నంగా ఉండేది. ఆయన ప్రేక్షకుల వైపు వీపు తిప్పి, గోడ వైపు తిరిగి... గోడను సంబోధిస్తున్నట్టూ, గోడకు బోధిస్తున్నట్టూ ప్రసంగించేవాడు. చాలాకాలం ఇది చూసిన కొందరు ..ఎందుకిలా వింతగా ప్రవర్తిస్తారు?’’ అని ప్రశ్నించారు.


ఆ ప్రశ్న విన్న బోధి ధర్మ కళ్ళ నిండా నీరు నిండింది. ఆయన జవాబిస్తూ ‘‘ప్రసంగాలు చేస్తున్నప్పుడు ‘గోడకు చెప్పినా, మీకు చెప్పినా ఒకటే’ అనే భావం నాలో కలుగుతోంది. గోడ నా బోధను విన్నా దాన్ని గ్రహించలేదు. ఆచరించలేదు. మార్పు చెందదు. మీరు కూడా అంతే! నేను చెప్పేది అర్థం చేసుకోరు. ఆచరించరు. మారరు. ఇక నేను ముఖం ఏ వైపు పెడితేనేం? మిమ్మల్ని చూసి ప్రసంగిస్తే మీలో మార్పు వస్తుందనే ఆశ నాలో కలగవచ్చు. ఆ తరువాత ఆశాభంగం కావచ్చు. కానీ గోడ విషయంలో అలాంటిదేం జరగదు కదా!’’ అన్నాడు.


అలాంటి బోధి ధర్మ దగ్గరకు ఒక వ్యక్తి వచ్చాడు. అతనితో కూడా బోధి ధర్మ నేరుగా మాట్లాడకుండా, గోడవైపు ముఖం పెట్టి మాట్లాడసాగాడు. ఆ వ్యక్తి కదలకుండా, మెదలకుండా పన్నెండు గంటల సేపు బోధి ధర్మ చెప్పినదంతా విన్నాడు. అతనికి ఎంతో ఆనందం కలిగింది. అంత మధురమైన బోధ చేసిన గురువు ముఖాన్ని చూడాలనే ఆకాంక్ష తీవ్రమయింది. మరో ఆలోచన చేయకుండా తన చేతుల్లో ఒకదాన్ని నరికి, బోధి ధర్మ చూసేలా విసిరాడు. ‘‘గురువుగారూ! మీరు నా వైపు తిరిగి మీ ముఖాన్ని చూపించకపోతే నా తల నరికేసుకుంటాను’’ అన్నాడు.

అతని మాటల్లో, చేతల్లో బోధి ధర్మకు శ్రద్ధ కనిపించింది. ‘‘వద్దు, వద్దు. నువ్వు చేసిందే చాలు... నీలో ఉన్న జ్ఞాన తృష్ణనూ, శ్రద్ధనూ, పట్టుదలనూ చెప్పడానికి! నీలాంటి వాడి కోసమే ఈ గుహలో కూర్చొని పన్నెండేళ్ళుగా ఎదురు చూస్తున్నాను. ఆ ఎదురుచూపు ఇప్పటికి ఫలించింది’’ అంటూ అతనివైపు తిరిగి కౌగలించుకున్నాడు బోధి ధర్మ. ఆయన కళ్ళ వెంట కారుతున్న నీరూ, తెగిన అవతలి వ్యక్తి చేతి నుంచి కారుతున్న నెత్తురూ... వారి గురు శిష్య సంబంధానికి నాంది పలికాయి.

- రాచమడుగు శ్రీనివాసులు


Updated Date - 2020-11-20T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising