ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెలుగై దారి చూపండి!

ABN, First Publish Date - 2020-07-24T05:30:00+05:30

విశ్వాసుల గురించి ఏసు ప్రభువు ప్రస్తావించిన మరో పోలిక... వెలుగు. ‘‘మీరు లోకానికి వెలుగు లాంటివారు. కొండ మీద ఉన్న నగరం మరుగున పడకుండా ఉంటుంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశ్వాసుల గురించి ఏసు ప్రభువు ప్రస్తావించిన మరో పోలిక... వెలుగు. ‘‘మీరు లోకానికి వెలుగు లాంటివారు. కొండ మీద ఉన్న నగరం మరుగున పడకుండా ఉంటుంది. ఎవరూ దీపం వెలిగించి, దాన్ని బుట్ట కింద దాచి ఉంచరు. దీప స్తంభం మీద పెడతారు. అది ఇంట్లో ఉన్న వారందరికీ వెలుగును ఇస్తుంది. మీరు కూడా అదే విధంగా మనుషుల ముందు దీపంలా ప్రకాశించండి. మీ మంచి పనులను వారు చూస్తారు. పరలోకంలో ఉన్న మీ తండ్రి ఘనతను ప్రకాశింపజేస్తారు’’ (మత్తయి సువార్త 5:14-16) అని ఆయన చెప్పాడు.


చీకటి ఆవరించిన చోట దీపం వెలుగు నింపుతుంది. అలాగే పరిపూర్ణమైన విశ్వాసం ఉన్న వారు చీకటిలో దీపంలా ఉండాలి. దారి తప్పిన హృదయాల్లో చీకటిని పారద్రోలి, విశ్వాసాన్ని వెలిగించాలి. అదే సమయంలో విశ్వాసులు చేసే మంచి పనులు అందరికీ తెలిసేలా ఉండాలి. అంటే దైవం చూపించిన దారిలో ప్రయాణించాలి. ఆ దారి గొప్పతనాన్ని అందరికీ తెలియజెప్పాలి. అప్పుడే దేవుడి ఘనతనూ, ఆయన చూపించిన మార్గంలోని విశిష్టతనూ ఇతరులు గ్రహించగలుగుతారు. తమ ‘విశ్వాసం’ అనే దీపాన్ని వెలిగించుకుంటారు. తోటివారికి దారి చూపే దీపాలవుతారు.

Updated Date - 2020-07-24T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising