ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృతజ్ఞులమై ఉందాం!

ABN, First Publish Date - 2020-07-10T05:30:00+05:30

దేవునికీ, ఆయన దాసుడికీ మధ్య ఉండే సంబంధానికి ముఖ్యమైన పునాది కృతజ్ఞత. ఈ బంధం హృదయంలో, వాక్కులో, ఆచరణలో ఉంటుంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేవునికీ, ఆయన దాసుడికీ మధ్య ఉండే సంబంధానికి ముఖ్యమైన పునాది కృతజ్ఞత. ఈ బంధం హృదయంలో, వాక్కులో, ఆచరణలో ఉంటుంది.


ఆరాధనలన్నిటికీ ఆత్మలాంటిది కృతజ్ఞత. ఎవరైనా మనకు మేలు చేస్తే, దాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించాలి. దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మేలు చేసిన వ్యక్తి పట్ల ప్రేమాభిమానాలు కలిగి ఉండాలి. బ్రహ్మాండమైన ఈ విశ్వంలో ‘మానవుడు’ అనే చిన్నారి జీవి కోసం విశ్వ ప్రభువు ఎన్నెన్ని ఏర్పాట్లు చేశాడో గమనించండి. మనం పీల్చే ప్రతి శ్వాసా ఊపిరితిత్తులలోకి వెళ్ళి, ప్రాణాధారం అవుతుంది. అది దైవానికి కృతజ్ఞతలు అర్పించుకోవాలని మనకు గుర్తు చేస్తూ ఉంటుంది. గాలినే కాదు, ప్రతి క్షణం మనకు ప్రయోజనం కలిగించే అసంఖ్యాకమైన వనరులను అల్లాహ్‌ మనకు ప్రసాదించాడు. ఆయన అనుగ్రహించిన వస్తువులనూ, చేసిన మేళ్ళనూ అనుక్షణం గుర్తు పెట్టుకున్నప్పుడే నిజమైన కృతజ్ఞతా భావం కలుగుతుంది. ఎవరి హృదయాల్లో కృతజ్ఞత ఉండదో వారి విశ్వాసం స్థిరంగా ఉండదు. అలాంటి వారి ఆరాధనలలో సంకల్పశుద్ధి ఉండదు.  


అందమైన ముఖం, పొందికైన అంగసౌష్టవం, ఆరోగ్యవంతమైన శరీరం... ఇవి మనిషి కోరి ఎంచుకున్నవి కావు. సృష్టికర్త ఇచ్చిన గొప్ప వరాలు. అలాగే శరీరంలోని అవయవాలనూ, వాటిని వినియోగించుకొనే బుద్ధిబలాన్నీ దేవుడు ప్రసాదించాడు. అంతేకాదు, మనిషి జీవించడానికి ఈ ప్రపంచాన్ని ఇచ్చాడు. హృదయపూర్వకమైన కృతజ్ఞత అంటే దేవుడు ప్రసాదించిన వరాలను అనుక్షణం తలచుకోవడమే!

దేవుడు మనకు ఎన్నో మహాభాగ్యాలను ప్రసాదించాడన్న భావన మనలో ఎల్లప్పుడూ సజీవంగా ఉండకపోతే కృతజ్ఞతా భావం పెరగదు. ఆయనను ఎప్పుడూ స్మరిస్తూ ఉండాలి. ఏవైనా కష్టాలు వస్తే సహనం వహించాలి. అంతే తప్ప కృతఘ్నతతో ప్రవర్తించకూడదు.

-మహమ్మద్‌ వహీదుద్దీన్‌


Updated Date - 2020-07-10T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising