ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘అన్నమాచార్య కీర్తనలు’ ... ఆర్కే మఠ్ ఆన్‌లైన్ తరగతులు

ABN, First Publish Date - 2020-10-07T21:58:01+05:30

తెలుగునాట అన్నమాచార్య సంకీర్తనలకు విశేష ఆదరణ ఉంది. తిరుమలనాథునికి పద సంకీర్తనార్చన చేసిన వాగ్గేయకారుడు ఆయన. తేటతేట తెలుగులో... అలతి అలతి పదాలతో.. అజరామరమైన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలుగునాట అన్నమాచార్య సంకీర్తనలకు విశేష ఆదరణ ఉంది. తిరుమలనాథునికి పద సంకీర్తనార్చన చేసిన వాగ్గేయకారుడు ఆయన. తేటతేట తెలుగులో... అలతి అలతి పదాలతో.. అజరామరమైన సాహిత్యాన్ని అందించారు. తెలుగు సాహిత్యంలో పద కవితా పితామహుడుగా నిలిచారు. అన్నమాచార్య కీర్తనలపై ఆసక్తి కలవారికి సంగీత తరగతులను నిర్వహించనున్నట్టు నగరంలోని ఆర్కే మఠ్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఆన్ లైన్‌ తరగతులు అక్టోబర్ 11 నుంచి డిసెంబర్ 12 వరకు రెండు నెలల పాటు ప్రతి శని, ఆదివారాలు జరగనున్నాయి. సాయంత్రం  5 గంటల నుంచి 6 గంటల వరకు క్లాసులు ఉంటాయి. పదేళ్ల పైన వారు మాత్రమే అర్హులు. 


ఆర్‌కే మఠ్‌లో యోగా, ధ్యానం, వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందింప చేసే కోర్సులు కూడా నిర్వహిస్తున్నారు. మహిళలకు, న్యాయవాదులకు కూడా ప్రత్యేక కోర్సులున్నాయి. బాలల కోసం బాల వికాస్ నిర్వహిస్తున్నారు.  


మరిన్ని వివరాలకు 040-27627961, 9177232696 నెంబర్లలో సంప్రదించవచ్చని రామకృష్ణ మఠం ప్రతినిధులు తెలిపారు.   

Updated Date - 2020-10-07T21:58:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising