ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘సాలిటెయిర్‌’తో స్టయిలిష్‌గా..

ABN, First Publish Date - 2020-02-07T05:55:26+05:30

ఉద్యోగినులు నగలకు దూరంగా ఉండాలి అనుకుంటే పొరపాటు. నిజానికి ప్రత్యేకంగా ఉద్యోగినుల అలంకరణ కోసమే తయారయ్యే నగలూ ఉన్నాయి. వాటిలో ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్‌ ‘సాలిటెయిర్‌ డైమండ్స్‌’!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉద్యోగినులు నగలకు దూరంగా ఉండాలి అనుకుంటే పొరపాటు. నిజానికి ప్రత్యేకంగా ఉద్యోగినుల అలంకరణ కోసమే తయారయ్యే నగలూ ఉన్నాయి. వాటిలో ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్‌ ‘సాలిటెయిర్‌ డైమండ్స్‌’!
 
ఉద్యోగినులకు నప్పుతాయి
డైలీవేర్‌గా ఎలాంటి నగలు సూటవుతాయి? అనే విషయంలో ఉద్యోగినులు అయోమయానికి లోనవుతూ ఉంటారు. అయితే ఇలాంటి వాళ్లు ‘సాటిటెయిర్‌ డైమండ్‌’ నగల్ని ఎంచుకోవచ్చు. సింపుల్‌గా, హుందాగా, ఆకర్షణీయంగా కనిపించాలనుకుంటే ఈ నగల్నే ఎంచుకోవాలి. తక్కువ బరువుతో, చక్కని మెరుపులీనే వజ్రాలతో తయారయ్యే ఈ నగలు రోజూ ధరించడానికి వీలుగా, ఎలాంటి వస్త్రధారణకైనా నప్పేటట్టుగా ఉంటాయి.
 
ఇవే ఎందుకంటే?
కష్టపడి డబ్బులు కూడబెట్టే ఉద్యోగినులు ప్రతి రోజూ వాడుకోవడానికి వీలుండే నగలు కొనుక్కోవాలి. తక్కువ బరువు, నాణ్యత కలిగిన, మేలు రాళ్లు పొదిగిన నగలైతే పెట్టుబడికి తగిన వాడకం ఉంటుంది. సాలిటెయిర్‌ డైమండ్స్‌ పొదిగిన నగలైతే చుడీదార్‌, చీరలు, స్కర్ట్‌, జీన్స్‌... ఇలా సంప్రదాయ కట్టుబొట్టుతో పాటు ఎలాంటి ఆధునిక వస్త్రధారణకైనా సూటవుతాయి. బంగారంలో పొదిగిన సాలిటెయిర్‌ డైమండ్స్‌ ఇప్పుడు ఎక్కువగా వాడుకలో ఉన్నాయి. ఉంగరం, బ్రేస్‌లెట్‌, పెండెంట్‌... ఈ మూడు కలిపి సెట్‌గా కొనుక్కోవచ్చు.
 
సర్టిఫికెట్‌ తప్పనిసరి!
సాలిటెయిర్‌ డైమండ్స్‌ను ‘సెంట్‌’లతో కొలుస్తారు. ఈ నగలను కొనేటప్పుడు రాళ్ల మెరుపు, బరువు, వాడిన బంగారం, తరుగుల గురించి తెలుసుకోవాలి. రాళ్ల నాణ్యతకు హామీగా ‘జి.ఐ.ఎ లేదా ఐ.జి.ఐ’ సర్టిఫికెట్‌ తీసుకోవాలి. మార్పిడి చేసే సమయంలో రాళ్లు, బంగారం ధర తగ్గకుండా చూసుకోవాలి. అలా రసీదు మీద రాయించుకోవాలి. ఇక నగల్లో ఒంటి రాయితో తయారైన పెండెంట్లు తీసుకోవచ్చు. ఎక్కువగా మెరవాలనుకుంటే క్లస్టర్‌ డైమండ్‌ నగల్ని ఎంచుకోవచ్చు. బంగారం ఇష్టపడని కాలేజీ అమ్మాయిలు ప్లాటినంతో తయారైన సాలిటెయిర్‌ డైమండ్‌ నగల్నీ ఎంచుకోవచ్చు. ఇవి వెస్టర్న్‌ వేర్‌ మీదకు చక్కగా నప్పుతాయి.

మంజులా రావు
మంజుల జ్యువెల్స్‌, హైదరాబాద్‌

Updated Date - 2020-02-07T05:55:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising