ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యమం... కొత్తరూపంలో..!

ABN, First Publish Date - 2020-04-04T06:08:51+05:30

‘‘ప్రజా హక్కుల కోసం, మహిళల రక్షణ కోసం నిత్యం పోరాడే నాలాంటి వారికి ‘లాక్‌డౌన్‌’తో చేతులు, కాళ్లు కట్టేసినట్టు అనిపిస్తుంది. అయితే ఈ సంకట స్థితిలో ఇంటిపట్టునే ఉండడం కూడా ఒకరకంగా ప్రజలకు ‘అండ’గా నిలబడడమే కదా.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘‘ప్రజా హక్కుల కోసం, మహిళల రక్షణ కోసం నిత్యం పోరాడే నాలాంటి వారికి ‘లాక్‌డౌన్‌’తో చేతులు, కాళ్లు కట్టేసినట్టు అనిపిస్తుంది. అయితే ఈ సంకట స్థితిలో ఇంటిపట్టునే ఉండడం కూడా ఒకరకంగా ప్రజలకు ‘అండ’గా నిలబడడమే కదా. కరోనా మహమ్మారి నియంత్రణ మన తక్షణ కర్తవ్యం. అందుకోసం అందరం కలిసి పనిచేయాలి. ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండడమే దీని నియంత్రణకు ప్రధాన ప్రత్యామ్నాయం. అయితే ఒక సోషల్‌ యాక్టివిస్టుగా సుమారు 40 ఏళ్లుగా దేశంలో అనేక ఉద్యమాలలో పనిచేసిన నాకు ప్రజలను ఆదుకోవాల్సిన ఈ సమయంలో వారికి దూరంగా ఉండాల్సి వస్తోందని బాధగా ఉంది. ఇన్నేళ్లలో ఎన్నో సంక్షోభ సమయాలలో ప్రజలతో ఉంటూ పనిచేశా. 1984లో సిక్కులపై దాడులప్పుడు జనాల్లోకి వెళ్లా. నా వంతు తోడ్పాటు అందించా. బాబ్రీ మసీదు ఇష్యూ సందర్భంగా ఢిల్లీలో అల్లర్లు చెలరేగాయి. అప్పుడూ ప్రజలకు అండగా నిలబడ్డా. లక్నోకి వెళ్లినపుడు ‘మాకు మందిర్‌, మసీదు వద్దు... శాంతి కావాల’ని నినదించాం. సీపీఎం తరపున ఎన్‌ఆర్‌సీ రద్దు చేయాలని పోరాడా. అయితే ఈ సంక్షోభ సమయంలో నేను నిర్వర్తించాల్సిన సామాజిక బాధ్యత ‘సోషల్‌ డిస్టెన్స్‌’ అని భావించి ఇంటికే కట్టుబడి ఉన్నా. లాక్‌డౌన్‌కు ముందు ఇంటి నుంచి పొద్దున్న బయటకు వెడితే సాయంత్రం ఎప్పటికో ఇల్లు చేరేదాన్ని. ఇపుడు ‘కర్ఫ్యూ ఎప్పుడు తీసేస్తారా?’ అని ఎదురుచూస్తున్నా.


ఒక ఉద్యమకారిణిగా కరోనా మహమ్మారి విస్తరిస్తున్న ఈ వేళలో ప్రజలకు అండగా నిలవాలని, వారిలోని భయం పోగొట్టాలని తపన పడుతున్నా. వారికి వైరస్‌పై అడ్వకసీ వర్కు చేద్దామనిపిస్తోంది. కానీ కరోనా వైరస్‌ నియంత్రణకు ఐసొలేషన్‌ ఒక్కటే మార్గం కాబట్టి దాన్ని పాటిస్తున్నా. అంటే ఉద్యమం కొత్త రూపంలో అన్నమాట. తొందరలోనే ఈ వైరస్‌ అంతరించి అందరం ‘చేయి చేయి కలుపుకునే’ రోజు కోసం ఆశగా ఎదురుచూస్తున్నా.’’

- ఆశాలత

సిఇసి మెంబర్‌, అఖిల భారత   ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా)

Updated Date - 2020-04-04T06:08:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising