ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పది నిమిషాల్లో... పాల అటుకులు!

ABN, First Publish Date - 2020-04-06T06:32:43+05:30

వంటకు సమయం చిక్కకపోయినా, ఇంట్లో సరుకులు నిండుకున్నా.. సందర్భం ఏదైనా సింపుల్‌గా పాల అటుకులతో ఆ పూటకు లాగించేయవచ్చు. పాల అటుకులు రుచికరంగా ఉండడమే కాదు వేసవిలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వంటకు సమయం చిక్కకపోయినా, ఇంట్లో సరుకులు నిండుకున్నా.. సందర్భం ఏదైనా సింపుల్‌గా పాల అటుకులతో ఆ పూటకు లాగించేయవచ్చు. పాల అటుకులు రుచికరంగా ఉండడమే కాదు వేసవిలో ఆరోగ్యానికి మంచిది కూడా! పది నిమిషాల్లో పాల అటుకులను వండుకోవచ్చు. 

కావలసిన పదార్థాలు:

  • అటుకులు - కప్పు
  • బాదం పప్పులు - 8
  • పిస్తా పప్పులు - 8
  • ఖర్జూరాలు - 4
  • బెల్లం - రుచికి తగినంత
  • పాలు - కప్పు


తయారుచేసే విధానం: ముందు శుభ్రంగా కడిగి ఆరబెట్టి ఉంచుకున్న అటుకులను ఒక పాత్రలో వేసుకోవాలి. బాదం, పిస్తా, ఖర్జూరాలను ముక్కలుగా తరిగి అందులో కలుపుకోవాలి. ఖర్జూరాలు లేదా బెల్లం ముక్క వేసుకోవాలి. ఇప్పుడు వేడి వేడి పాలు పోసి అటుకుల మిశ్రమాన్ని నానబెట్టాలి. ఐదు నిమిషాలు ఆగి రుచికరమైన పాల అటుకులను ప్లేట్‌లో వడ్డించుకొని తినడమే తరువాయి.


Updated Date - 2020-04-06T06:32:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising