ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒంటరితనం ఆమడదూరం!

ABN, First Publish Date - 2020-05-25T05:13:14+05:30

కనీసం నాలుగో వంతు ప్రజలు లాక్‌డౌన్‌లో ఒంటరితనంతో బాధపడుతున్నారని మెంటల్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ పరిశోధనలో తేలింది. ఇది మానసిక ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావం చూపిస్తోందని పరిశోధకులు గుర్తించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కనీసం నాలుగో వంతు ప్రజలు లాక్‌డౌన్‌లో ఒంటరితనంతో బాధపడుతున్నారని మెంటల్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ పరిశోధనలో తేలింది. ఇది  మానసిక ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావం చూపిస్తోందని పరిశోధకులు గుర్తించారు. శారీరక బాధలకు గురవుతున్న వ్యక్తి ఎలా బాధపడతారో ఒంటరితనం కూడా అలానే బాధిస్తుంది. చిటికెలో ఒంటరితనాన్ని పారదోలే చిట్కా ఏదీ లేదు. కానీ కొద్దిసేపైనా సంతోషాన్నిచ్చే పని చేస్తే అది ఒంటరితనం నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది. 



ఆన్‌లైన్‌లో అభిప్రాయాలు పంచుకోండి

లాక్‌డౌన్‌లో సోషల్‌ మీడియా మీ జీవన రేఖ. ఆన్‌లైన్‌లో కొంతమందితో స్నేహాలు పెంచుకోండి. మాటలు కలపండి. సృజనాత్మకత, హాస్య చతురత ఉన్న వ్యక్తులతో, బృందాలతో చాట్‌ చేయండి. తద్వారా మీలో వచ్చే మార్పులను గుర్తించండి. 


కొత్త నైపుణ్యాలు నేర్వండి

మనం సంతోషంగా ఉండడానికి మెదడు డోపమైన్‌ అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది. ఏదైనా కొత్త విషయం నేర్చుకునేటప్పుడు కూడా ఈ డోపమైన్‌ విడుదల అవ్వటం వల్ల మనం సంతోషంగా ఉంటాం. ఏదైనా సంగీత పరికరాన్ని ప్లే చేయడం, వీడియోల్లో చూసి డ్యాన్స్‌ ప్రాక్టీసు చేయడం లాంటి చిన్న విషయాలు అయినా మేలు చేస్తాయి. 


భవిష్యత్తుకు ప్రణాళికలు వేయండి

లాక్‌డౌన్‌ ఎత్తేశాక ఉద్యోగం, వ్యాపారాల్లో ఏం చేయాలనుకుంటున్నారో ప్లాన్‌ చేయండి. లాక్‌డౌన్‌ ఎత్తేయగానే మీరు బాగా ఇష్టపడే వ్యక్తులను ముందుగా కలవండి. 


కొత్తవి ట్రై చేయండి

మీ శరీరానికి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడం ద్వారా మీ మెదడులో సానుకూల భావాలను కలగజేసే రసాయన చర్యలను ప్రేరేపించవచ్చు. మీరు ఎప్పుడూ వాడని లగ్జరీ ఫేస్‌మాస్క్‌ వాడడం, ఎన్నడూ తినని చాక్లెట్‌ తినడం లాంటివి చేయడం ద్వారా అవి మీ మెదడులో సంతోషాన్ని కలిగించే సెరోటోనిన్‌, డోపమైన్‌, ఆక్సిటోసిన్‌ లాంటి రసాయనాలను విడుదల చేస్తాయి. 

Updated Date - 2020-05-25T05:13:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising