ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వయసు చిన్న... ప్రతిభ మిన్న!

ABN, First Publish Date - 2020-05-04T05:30:00+05:30

ఈ చిన్నారి పేరు ఇషితా కత్యాల్‌. వయస్సు పదేళ్లు. పుణేలోని బాలెవాడి ప్రాంతంలో ఉన్న విబ్జియార్‌ హైస్కూల్‌లో ఐదో తరగతి చదువుతోంది. ఇంతకీ ఈమె ప్రత్యేకత ఏంటి అంటారా? ఇషితా కత్యాల్‌ న్యూయార్క్‌లో జరిగిన టెడ్‌ యూత్‌ కాన్ఫరెన్స్‌లో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ చిన్నారి పేరు ఇషితా కత్యాల్‌. వయస్సు పదేళ్లు. పుణేలోని బాలెవాడి ప్రాంతంలో ఉన్న విబ్జియార్‌ హైస్కూల్‌లో ఐదో తరగతి చదువుతోంది. ఇంతకీ ఈమె ప్రత్యేకత ఏంటి అంటారా? ఇషితా  కత్యాల్‌ న్యూయార్క్‌లో జరిగిన టెడ్‌ యూత్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడే అవకాశం లభించిన అతి పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందింది. అంతేకాదు, ఇషితా రచయిత్రి కూడా.


ఎనిమిదేళ్ల వయసులోనే ‘సిమ్రాన్‌ డైరీ’ పేరుతో ఒక పుస్తకాన్ని రాసింది. గత ఏడాది టెడ్‌ ఎక్స్‌ పుణేలో నిర్వహించిన ఒక ఈవెంట్‌లో ఇషిత పాల్గొంది. ఆ కార్యక్రమంలో బాగా ఎంజాయ్‌ చేసింది. ఆ కార్యక్రమం బాగా నచ్చడంతో వాళ్ల టీమ్‌లో భాగస్వామి కావాలనుకుంటున్నానని నిర్వాహకులను అడిగింది. అందుకు వాళ్లు సరేనన్నారు. తరువాత గ్లోబల్‌ టెడ్‌ ఎక్స్‌ వాలంటీర్లు నిర్వహించిన ఇంటర్వ్యూలో నెగ్గింది. తద్వారా ఆసియా పసిఫిక్‌ రీజియన్‌లో టెడ్‌ ఎక్స్‌ యూత్‌ ఈవెంట్స్‌ను నిర్వహించే అతి పిన్న నిర్వాహకురాలిగా గుర్తింపు పొందింది ఇషిత. ‘‘వేసవి సెలవుల్లో సమయాన్ని వృథా చేయను. ఏదైనా ఉపయోగపడే పని చేస్తుంటాను’’ అని అంటుంది ఇషిత. సిమ్రాన్‌ డైరీ పుస్తకాన్ని అమెజాన్‌ కిండెల్‌ స్టోర్‌ మొదట ప్రచురించింది.

Updated Date - 2020-05-04T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising