ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలివైన క్షీరదం!

ABN, First Publish Date - 2020-08-13T05:30:00+05:30

ఈ జంతువు ఎలుకలా కనిపిస్తోంది కదూ! దీని పేరు ప్రైయరీ డాగ్‌. ఇవి చాలా తెలివైనవి. ఉత్తర అమెరికా, కెనడా, మెక్సికో దేశాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. వీటి విశేషాలివి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ జంతువు ఎలుకలా కనిపిస్తోంది కదూ! దీని పేరు ప్రైయరీ డాగ్‌. ఇవి చాలా తెలివైనవి. ఉత్తర అమెరికా, కెనడా, మెక్సికో దేశాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. వీటి విశేషాలివి.

  1. భూమి లోపల బొరియలు చేసుకుని నివసిస్తాయి. వీటి బొరియల్లో అవి పడుకోవడానికి ప్రత్యేక ప్రదేశం, టాయిలెట్స్‌ కోసం మరో ప్రదేశం, బయటకు వెళ్లే దారిలో లిజనింగ్‌ పోస్టులు ఉంటాయి. బొరియల్లోకి గాలి, వెలుతురు ధారాళంగా వస్తుంది. ప్రైయరీ డాగ్స్‌ గుంపులుగా నివసిస్తాయి. వీటి గుంపులను ‘టౌన్స్‌’ అని పిలుస్తారు.
  2. ఇవి ఒకదానికొకటి సహాయం చేసుకుంటాయి. ఆహారంతో పాటు రక్షణ బాధ్యతలను కూడా పంచుకుంటాయి.
  3. ప్రైయరీ డాగ్స్‌ అన్నీ బొరియల్లో ఉంటే ఒకటి రెండు బయట ఉండి కాపలా వస్తుంటాయి. ఆపద ముంచుకొస్తే ప్రత్యేకంగా అరవడం, శబ్దాలు చేయడం ద్వారా మిగతా వాటిని అప్రమత్తం చేస్తాయి. 
  4. అప్పుడే పుట్టిన ప్రైయరీ డాగ్‌ కళ్లు మూసే ఉంటుంది. పూర్తిగా తల్లి సంరక్షణలో ఉంటుంది. 6 వారాల వరకు బొరియల నుంచి బయటకు రాదు. 
  5. ఇవి చాలా వేగంగా కదులుతాయి. ప్రమాదం ఎదురైనప్పుడు తమ పదునైన పంజా, దంతాలతో శత్రువు మీద దాడిచేస్తాయి. 

Updated Date - 2020-08-13T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising