ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పక్షులు ఆత్మహత్య చేసుకుంటాయా!

ABN, First Publish Date - 2020-03-16T06:13:02+05:30

వివిధ రంగుల్లో, భిన్నమైన అరుపులతో ఆహ్లాదాన్ని పంచే పక్షులు ఆత్మహత్య చేసుకోవడం గురించి విన్నారా? అసోంలోని జటింగా అనే గ్రామంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వివిధ రంగుల్లో, భిన్నమైన అరుపులతో ఆహ్లాదాన్ని పంచే పక్షులు ఆత్మహత్య చేసుకోవడం గురించి విన్నారా? అసోంలోని జటింగా అనే గ్రామంలో ఏటా కొన్ని వేల పక్షులు ఆత్మహత్య చేసుకుంటున్నాయి. పక్షులు ఎక్కడైనా ఆత్మహత్య చేసుకుంటాయా? అంటే నిజమే అంటున్నారు ఆ గ్రామస్థులు. గత కొన్ని దశాబ్దాలుగా ఇలా జరుగుతోందని చెబుతున్నారు. ఏటా సెప్టెంబర్‌ నుంచి నవంబర్‌ మధ్య కాలంలోనే పక్షులు చనిపోవడం జరుగుతోంది. గౌహతికి 330 కి.మీల దూరంలో పచ్చని కొండల మధ్య ఉండే ఈ గ్రామం పక్షుల ఆత్మహత్య కథనాలతో దర్శనీయ ప్రదేశంగా మారింది. 


అయితే పరిశోధకులు మాత్రం పక్షులు ఆత్మహత్య చేసుకోవడం నిజం కాదని, వాతావరణ మార్పులు, ఇతర కారణాల వల్ల అవి చనిపోతున్నాయని అంటున్నారు. సెప్టెంబర్‌-నవంబర్‌ మధ్య కాలంలో బలమైన గాలులు వీయడం వల్ల పక్షులు కింద పడి గాయాలపాలై చనిపోతున్నాయని వారు చెబుతున్నారు. అలాగే పొగమంచు ఎక్కువగా ఉండడం, గ్రామంలోని వీధి దీపాల ఆకర్షణకు గురయి పక్షులు వేగంగా వచ్చి చెట్లకు, ఇళ్లకు ఢీకొట్టి చనిపోతున్నాయని తేల్చారు. అంతేకాదు గ్రామస్థులు పెద్ద పెద్ద కర్రలతో తక్కువ ఎత్తులో ఎగిరే పక్షులను చంపడాన్ని అధికారులు గుర్తించారు కూడా. పర్యాటకులను ఆకర్షించడం కోసమే గ్రామస్థులు పక్షులను చంపుతున్న విషయం వారి దృష్టికి వచ్చింది. దాంతో వారు ఆ గ్రామంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. అప్పటి నుంచి పరిస్థితిలో మార్పు వచ్చింది. ఇప్పుడు అక్కడ చనిపోయే పక్షుల సంఖ్య బాగా తగ్గింది.

Updated Date - 2020-03-16T06:13:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising