ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దొంగ ఎవరు?

ABN, First Publish Date - 2020-09-17T04:28:22+05:30

ఒకరోజు ఒక వ్యాపారస్థుని ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంట్లో పనివాళ్లే ఆ పని చేసి ఉంటారని వ్యాపారస్థుడు ఊహించాడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒకరోజు ఒక వ్యాపారస్థుని ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంట్లో పనివాళ్లే ఆ పని చేసి ఉంటారని వ్యాపారస్థుడు ఊహించాడు. బీర్బల్‌ను కలిసి జరిగిన విషయం చెప్పాడు. బీర్బల్‌ వ్యాపారస్థుని ఇంటికి వచ్చి పనివాళ్లందరినీ పిలిచాడు. దొంగతనం ఎవరు చేశారని ప్రశ్నించాడు. అందరూ ‘‘మాకు తెలియదు’’ అని సమాధానమిచ్చారు. బీర్బల్‌ కొద్దిసేపు ఆలోచించి ఒకే పొడవున్న కొన్ని కర్రపుల్లలు తెప్పించి పనివాళ్లందరికీ ఇచ్చాడు. ‘‘ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ల కర్ర ఉదయానికల్లా రెండు ఇంచులు పొడవు పెరుగుతుంది. ఎవరి కర్ర పొడవు పెరుగుతుందో వాళ్లే దొంగతనం చేసినట్టు’’ అని వాళ్లందరికీ చెప్పి ఇంటికి పంపించాడు బీర్బల్‌. మరుసటి రోజు పనివాళ్లందరూ వచ్చారు. బీర్బల్‌ అందరి దగ్గరా కర్రలు సేకరించాడు. ఒక పనివాడి కర్ర రెండు ఇంచులు చిన్నగా ఉండటం గమనించాడు. అది చూసి ‘‘ఇతనే దొంగ’’ అని అన్నాడు. వ్యాపారస్థుడు ఆశ్చర్యపోయి ‘‘అతనే దొంగ అని ఎలా చెబుతున్నారు’’ అన్నాడు. ‘‘దొంగతనం చేశాడు కాబట్టి కర్ర రెండు ఇంచులు పెరుగుతుందన్న భయంతో, రెండు ఇంచులు కత్తిరించి తీసుకొచ్చాడు. అలా దొరికిపోయాడు’’ అని చెప్పాడు బీర్బల్‌.

Updated Date - 2020-09-17T04:28:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising