ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐకమత్యమే మహాబలం!

ABN, First Publish Date - 2020-09-11T05:30:00+05:30

ఒక ఊరిలో ఓ రైతు ఉండేవాడు. అతనికి ముగ్గురు కొడుకులు. వాళ్లు చిన్నప్పటి నుంచి ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. కానీ పెద్దవాళ్లయ్యే కొద్దీ వాళ్ల ప్రవర్తనలో మార్పు రాసాగింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక ఊరిలో ఓ రైతు ఉండేవాడు. అతనికి ముగ్గురు కొడుకులు. వాళ్లు చిన్నప్పటి నుంచి ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. కానీ పెద్దవాళ్లయ్యే కొద్దీ వాళ్ల ప్రవర్తనలో మార్పు రాసాగింది. కలిసి మెలిసి ఉండాలని తండ్రి చెబుతున్నా వాళ్ల తీరు మారలేదు. ఎలాగైనా వారిలో మార్పు తీసుకొచ్చి అందరూ కలిసి మెలిసి ఉండేలా చేయాలని అనుకున్నాడు.


ఒక రోజు ముగ్గురిని పిలిచి, కొన్ని కట్టె పుల్లలు తెప్పించాడు. వాటిని కట్టలుగా కట్టమన్నాడు. తరువాత పెద్ద కొడుకుని పిలిచి కట్టను విరవమన్నాడు. అతని వల్ల కాలేదు. రెండో కొడుకుని పిలిచి ప్రయత్నించమన్నాడు. అతడి వల్ల కూడా కాలేదు. చివరగా చిన్న కొడుకుని పిలిచి ప్రయత్నించి చూడమన్నాడు. వాటిని విరవడం అతడి వల్ల కూడా కాలేదు. అప్పుడు పుల్లల కట్టను విప్పి ముగ్గురికి ఒక్కో పుల్లను ఇచ్చి విరవమన్నాడు. వాళ్లు సులభంగా విరిచేశారు. అప్పుడు తండ్రి ‘‘మీరు కూడా కలిసి ఉంటే మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు. విడిపోతే పుల్లల మాదిరిగా బలహీనులైపోతారు’’ అని వివరించాడు. దాంతో ‘ఇకపై కలిసిమెలిసి ఉంటాం’ అని తండ్రికి మాట ఇచ్చారు ముగ్గురు.

Updated Date - 2020-09-11T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising