ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిన్నారి శ్రావ్యకు ట్రంప్‌ అభినందన

ABN, First Publish Date - 2020-05-19T07:52:48+05:30

అమెరికాలో కరోనా రోగులకు ఉడతాభక్తిగా సాయం చేసిన పదేళ్ల శ్రావ్య అన్నపరెడ్డిని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభినందించారు. శ్రావ్య తల్లిదండ్రులు ఏపీకి చెందిన వాళ్లే. కొవిడ్‌ నియంత్రణ చర్యల్లో మునిగి ఉన్న అగ్నిమాపక సిబ్బందికి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్‌, మే 18: అమెరికాలో కరోనా రోగులకు ఉడతాభక్తిగా సాయం చేసిన పదేళ్ల శ్రావ్య అన్నపరెడ్డిని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభినందించారు. శ్రావ్య తల్లిదండ్రులు ఏపీకి చెందిన వాళ్లే. కొవిడ్‌ నియంత్రణ చర్యల్లో మునిగి ఉన్న అగ్నిమాపక సిబ్బందికి, నర్సులకు ఈ చిన్నారి కుకీస్‌ పంచి పెట్టింది. ఆరోగ్య కార్యకర్తలను అభినందిస్తూ, వారికి గ్రీటింగ్‌ కార్డులు అందించింది. మేరీల్యాండ్‌లోని హానొవర్‌ హిల్స్‌ ఎలిమెంటరీ స్కూలులో శ్రావ్య నాలుగో తరగతి చదువుతోంది. ఈ స్కూలులోని అమ్మాయిల స్కౌట్స్‌ ట్రూప్‌లో భాగమై, కరోనాపై పోరులో చురుగ్గా పాల్గొంటోంది. తమ శక్తి, వెసులుబాటు, ఆసక్తి మేరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్న వారందరినీ అధ్యక్షుడు ట్రంప్‌, ప్రఽథమ మహిళ మెలానియా గుర్తు చేసుకొన్నారు. శ్రావ్య సహా పలువురిని ఈ సందర్భంగా వారు ఘనంగా సత్కరించారు. ఈ మేరకు ‘ద వాషింగ్టన్‌ టైమ్స్‌’ ఓ కథనం ప్రచురించింది. 


Updated Date - 2020-05-19T07:52:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising