ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మేలు మరవని పులి!

ABN, First Publish Date - 2020-09-02T05:30:00+05:30

ఒక పులి ఒకరోజు మాంసం తింటుండగా నోటిలో ఎముక ఇరుక్కుపోయింది. దాంతో పులి బాధతో విలవిలలాడింది. ఆ పులి బాధను చాలా సేపటి నుంచి గమనిస్తున్న పక్షి, పులి దగ్గరకు వచ్చి ‘‘ఏం జరిగింది? ఎందుకు బాధపడుతున్నావు?’’ అని అడిగింది. అప్పుడు పులి ‘‘నా కోరల మధ్యలో ఎముక ఇరుక్కుంది. నొప్పి పుడుతోంది. దయచేసి నాకు సహాయం చేస్తావా’’ అని అడిగింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక పులి ఒకరోజు మాంసం తింటుండగా నోటిలో ఎముక ఇరుక్కుపోయింది. దాంతో పులి బాధతో విలవిలలాడింది. ఆ పులి బాధను చాలా సేపటి నుంచి గమనిస్తున్న పక్షి, పులి దగ్గరకు వచ్చి ‘‘ఏం జరిగింది? ఎందుకు బాధపడుతున్నావు?’’ అని అడిగింది. అప్పుడు పులి ‘‘నా కోరల మధ్యలో  ఎముక ఇరుక్కుంది. నొప్పి పుడుతోంది. దయచేసి నాకు సహాయం చేస్తావా’’ అని అడిగింది. ఆ పక్షి మొదట భయపడింది. ‘పులి నోటిలో తల పెట్టడమంటే చావును కొని తెచ్చుకోవడమే’ అని మనసులో అనుకుంది.


పక్షి భయాన్ని గమనించిన పులి ‘‘నువ్వు నాకు సహాయం చేస్తే నిన్ను ఎప్పటికీ మరిచిపోను. నీకు ఏ సహాయం కావాలన్నా చేస్తాను. నా ఆహారంలో కొద్దిగా నీకూ పెడతాను’’ అంది. అందుకు పక్షి సరేనంది. పులి నోటిలో ఇరుకున్న ఎముకను జాగ్రత్తగా తన ముక్కుతో బయటకు తీసింది. అప్పటి నుంచి పులి, పక్షి రెండూ స్నేహితులుగా మారాయి. ఒకరోజు ఒక వేటగాడు చెట్టుపైనున్న ఆ పక్షిపైకి బాణం గురి పెట్టాడు. అది గమనించిన పులి ఒక్కసారిగా గర్జించింది. దాంతో వేటగాడు భయంతో పరుగు అందుకున్నాడు. తన ప్రాణాలను కాపాడినందుకు పులికి పక్షి కృతజ్ఞతలు చెప్పింది.

Updated Date - 2020-09-02T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising