ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీళ్లకు వేలిముద్రలు లేవు!

ABN, First Publish Date - 2020-12-31T05:30:00+05:30

వేలిముద్రలు ఎంత ముఖ్యమో తెలిసిందే. ఆధార్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాస్‌పోర్టు... ఇలా చాలా చోట్ల వేలిముద్రలు అవసరమవుతాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేలిముద్రలు ఎంత ముఖ్యమో తెలిసిందే. ఆధార్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాస్‌పోర్టు... ఇలా చాలా చోట్ల వేలిముద్రలు అవసరమవుతాయి. ఏ ఇద్దరి వేలిముద్రలు ఒకేలా ఉండవు. అందుకే నేరస్థులను గుర్తించడంలోనూ పోలీసులకు వేలిముద్రలు ఉపయోగపడుతుంటాయి. అయితే ఒకవేళ వేలిముద్రలే లేకపోతే ఎలా? వేలిముద్రలు లేకుండా ఎవరైనా ఉంటారా? అంటే.. ఉన్నారు. 


 బంగ్లాదేశ్‌లోని రాజషాహి జిల్లాలో నివసించే సర్కర్‌ కుటుంబంలో ఎవరికీ వేలిముద్రలు లేవు. వంశపారంపర్యంగా ఇది వస్తోంది. వాళ్ల చేతులు పూర్తిగా ఎలాంటి రేఖలు లేకుండా నున్నగా ఉంటాయి. 


 వేలిముద్రలు లేకపోవడం వల్ల వాళ్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకోవడానికి వేలిముద్రలు తప్పనిసరి. ‘‘డ్రైవింగ్‌ లైసెన్స్‌ పరీక్ష పాసయ్యాను. కానీ ఫింగర్‌ప్రింట్స్‌ లేని కారణంగా అధికారులు లైసెన్స్‌ జారీ చేయలేదు’’ అని చెబుతారు అమల్‌ సర్కర్‌. 


 వీళ్లు తమ పేరుపై సిమ్‌కార్డు కూడా కొనుగోలు చేయలేకపోతున్నారు.   సిమ్‌కార్డు కొనాలంటే ఫింగర్‌ప్రింట్స్‌ తప్పక ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో వాళ్ల అమ్మ పేరుపై సిమ్‌ కార్డులు తీసుకుని వాడుకుంటున్నారు.


 వేలిముద్రలు లేకపోవడం చాలా అరుదైన జన్యుపరమైన సమస్య అని వైద్యులు తేల్చారు. దీన్ని ‘అడెర్మాటోగ్లిఫియా’ అంటారు. ఇది  తండ్రి నుంచి వారసులకు సంక్రమిస్తూ ఉంటుంది. 


Updated Date - 2020-12-31T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising