ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దాన ఫలితం!

ABN, First Publish Date - 2020-08-27T05:30:00+05:30

అక్బర్‌ మహారాజు తన రాజ్యంలోని ఒక మహర్షి గొప్పతనం గురించి తెలుసుకుని తన ఆస్థానానికి ఆహ్వానించాడు. ఆయనను దుస్తులు, కానుకలతో సత్కరించి తన అభిమానాన్ని చాటుకున్నాడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అక్బర్‌ మహారాజు తన రాజ్యంలోని ఒక మహర్షి గొప్పతనం గురించి తెలుసుకుని తన ఆస్థానానికి ఆహ్వానించాడు. ఆయనను దుస్తులు, కానుకలతో సత్కరించి తన అభిమానాన్ని చాటుకున్నాడు. అక్కడి నుంచి మహర్షి తిరిగి తన కుటీరానికి వెళుతుండగా దారిలో ఓ వ్యక్తి చలికి వణుకుతూ కనిపించాడు. మహర్షి తన దగ్గర ఉన్న దుస్తులను అతనికి ఇచ్చేశాడు.


కూతురు పెళ్లి కోసం కష్టపడుతున్న మరో వ్యక్తికి కానుకలను ఇచ్చేశాడు. ఆ విషయం ఆ నోటా ఈనోటా అక్బర్‌ చెవిన పడింది. మహర్షిని పిలిపించి ‘‘మేము మీకు కానుకలు ఇస్తే, మీరు ఇతరులకు ఇచ్చేయడం బాలేదు. ఇది మమ్మల్ని అవమానపరిచినట్టే అన్నాడు’’ కోపంగా. అప్పుడు మహర్షి ‘‘దానం చేయడమంటే ఆ వస్తువుపై పూర్తి హక్కు కోల్పోవడమే. మీరు ఇంకా ఆ వస్తువుల గురించి అడుగుతున్నారంటే, అవి మీవి అని భావిస్తున్నారు. అలా అయితే దానం చేసిన ఫలితం మీకు దక్కదు. మీరిచ్చిన వస్తువుల అవసరం నాకన్నా వారికే ఎక్కువగా ఉంది. అందుకే వారికి ఇచ్చాను’’ అన్నాడు. దాంతో తన తప్పు తెలుసుకున్న అక్బర్‌ మన్నించమని కోరాడు. 


Updated Date - 2020-08-27T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising