ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొసలి ఆయన పెంపుడు జంతువు!

ABN, First Publish Date - 2020-12-14T06:26:13+05:30

ఇంట్లో కుక్కలను పెంచుకోవడం సాధారణ విషయమే. పిల్లులను, చిలుకలను పెంచుకొనే వాళ్లను కూడా చూసుంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంట్లో కుక్కలను పెంచుకోవడం సాధారణ విషయమే. పిల్లులను, చిలుకలను పెంచుకొనే వాళ్లను కూడా చూసుంటారు. కానీ జపాన్‌లో ఓ వ్యక్తి ఏకంగా ఇంట్లో మొసలిని పెంచుకుంటున్నాడు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆ మొసలి ఆయన ఇంట్లో పెంపుడు జంతువులా పెరిగింది.


 జపాన్‌లో హిరోషిమాలోని క్యూర్‌ సిటీలో నివసించే నోబుమిత్సు అనే వ్యక్తి తన కొడుకు మారాం చేయడంతో ఓ మొసలి పిల్లను కొనిచ్చాడు. అప్పటి నుంచి ఆ మొసలి ఇంట్లో వ్యక్తిగా మారిపోయింది. 


 ఏడు అడుగుల పొడవు, 45 కేజీల బరువుండే ఈ మొసలిని తీసుకుని నోబుమిత్సు వాకింగ్‌కు కూడా వెళుతుంటారు.


 నోబుమిత్సు నివసించే చుట్టు పక్కల వాళ్లందరికీ మొసలి గురించి తెలుసు. పిల్లలు, పెద్దలు అందరూ ఆ మొసలితో ఫొటోలు దిగడానికి ఆసక్తి చూపుతుంటారు. ఆ మొసలి వల్ల నోబుమిత్సు క్యూర్‌సిటీలో హీరో అయ్యాడు.


 మొసలి కోసం ఇంట్లోనే ఓ బాత్‌ టబ్‌ ఏర్పాటు చేశారు. అయితే ఇంట్లో అది స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటుంది. నిత్యం మనుషులతో ఉండటం వల్ల ఆ మొసలి మనుషులను చూసి బెదరడం, గాయపరచడం చేయలేదు.

Updated Date - 2020-12-14T06:26:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising