ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేసవి సెలవుల్లో వెరైటీగా...!

ABN, First Publish Date - 2020-05-14T07:58:21+05:30

సెలవు రోజుల్లో రకరకాల యాక్టివిటీస్‌లో పాల్గొనాలని పిల్లలందరికీ ఉంటుంది. అందుకే వారికోసం ‘సోనీ యే’ ఛానల్‌ ప్రత్యేకంగా సమ్మర్‌ క్యాంప్‌ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తోంది. వినోదంతో పాటు కొత్త విషయాలు నేర్చుకోవాలనుకొనే వారికి ఇది మంచి అవకాశం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సెలవు రోజుల్లో రకరకాల యాక్టివిటీస్‌లో పాల్గొనాలని పిల్లలందరికీ ఉంటుంది. అందుకే వారికోసం ‘సోనీ యే’ ఛానల్‌ ప్రత్యేకంగా సమ్మర్‌ క్యాంప్‌ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తోంది. వినోదంతో పాటు కొత్త విషయాలు నేర్చుకోవాలనుకొనే వారికి ఇది మంచి అవకాశం.


  1. ఇంట్లో లభించే వస్తువులతో బొమ్మలు తయారుచేయడం, రీయూజబుల్‌ మాస్క్‌ల తయారీ, ఫొటో ఫ్రేమ్‌లు రూపొందించడం... ఇలా రకరకాల అంశాలతో ‘ద ఆర్ట్‌ జీనియస్‌ లాలన్‌’తో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ ఇష్టపడే పిల్లలు దీన్ని ఎంచుకోవచ్చు. 
  2. డాన్స్‌ మీకిష్టమైతే జుంబా ఎడ్యుకేషన్‌ స్పెషలిస్ట్‌ సుచేతా పాల్‌ అందించే టెక్నిక్స్‌తో డాన్స్‌కు మెరుగులద్దుకోవచ్చు. బోలెడు ఫన్‌తో పాటు పిల్లలు శారీరకంగా ఫిట్‌గా ఉండేందుకు డాన్స్‌ దోహదపడుతుంది.
  3. కథలు చెప్పడం మీకిష్టమా? అయితే ‘సోనీ యే సమ్మర్‌ క్యాంప్‌’లో దేవకి  మీకు కొత్త కొత్త కథలు వినిపిస్తుంది. రకరకాల క్యారెక్టర్లతో రూపొందించిన వీడియోలు ఎంతో అలరిస్తాయి. 
  4. మొక్కలు నాటడం, గార్డెనింగ్‌ మీ హాబీ అయితే గార్డెనింగ్‌ మాస్టర్‌ స్మితా చెప్పే సలహాలు తెలుసుకోవచ్చు. ఇంట్లో లభించే పనిముట్లతో గార్డెనింగ్‌ ఎలా చేయాలో నేర్చుకోవచ్చు.
  5. ఒకవేళ మీకు యోగా నేర్చుకోవాలని అనిపిస్తే సాక్షి కర్బందా నేర్పే యోగా క్లాసులు వినవచ్చు. వీటికి సంబంధించిన వీడియోలన్నీ ‘సోనీ యే’ కిడ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానెల్‌లో లభిస్తాయి. వీటిని యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌లోనూ చూడొచ్చు. 

Updated Date - 2020-05-14T07:58:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising