ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాబేలు-పక్షి

ABN, First Publish Date - 2020-05-11T06:13:30+05:30

ఒక చెట్టుపై గూడు పెట్టుకుని పిల్లలతో కలిసి ఓ పక్షి ఆనందంగా జీవిస్తోంది. ఒకరోజు ఆ దారి గుండా తాబేలు వెళుతూ అదే చెట్టు కింద విశ్రాంతి కోసం ఆగింది. చెట్టుపై ఉన్న గూడును చూసి పక్షితో ‘‘నీదీ ఒక ఇల్లేనా? విరిగిన పుల్ల ముక్కలతో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక చెట్టుపై గూడు పెట్టుకుని పిల్లలతో కలిసి ఓ పక్షి ఆనందంగా జీవిస్తోంది. ఒకరోజు ఆ దారి గుండా తాబేలు వెళుతూ అదే చెట్టు కింద విశ్రాంతి కోసం ఆగింది. చెట్టుపై ఉన్న గూడును చూసి పక్షితో ‘‘నీదీ ఒక ఇల్లేనా? విరిగిన పుల్ల ముక్కలతో కట్టుకున్నావు. పైన నీడ లేదు. అంతేకాకుండా, మీ ఇంటిని మీరే నిర్మించుకోవాలి. నన్ను చూడు. నా పెంకే నా ఇల్లు. నీ గూడు కన్నా ఇది చాలా నయం కదూ!’’ అంటూ ఎద్దేవా చేసింది. 


ఆ మాటలు విన్న పక్షి... ‘‘అవును. నాది పుల్లలతో కట్టుకున్న గూడే. చూడటానికి చిరిగి పోయి కనిపిస్తుంది. కానీ నేను కష్టపడి కట్టుకున్నాను. ఈ ఇల్లంటే నాకెంతో ఇష్టం’’ అంది.


‘‘నువ్వు నా పెంకు చూసి అసూయపడుతున్నావు కదూ!’’ అంది తాబేలు.

‘‘నా గూడు నా కుటుంబ సభ్యులకే కాకుండా, స్నేహితులకు కూడా చోటునిస్తుంది. నీ పెంకు నీకు తప్ప మరొకరికి చోటు కల్పించలేదు. నీకూ ఇల్లు ఉంది కావచ్చు కానీ, నాకు మంచి ఇల్లు ఉంది’’ అని సమాధానమిచ్చింది పక్షి.

పక్షి సమాధానం విన్న తాబేలు మెల్లగా అక్కడి నుంచి జారుకుంది.


Updated Date - 2020-05-11T06:13:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising