ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.87కే ఇల్లు!

ABN, First Publish Date - 2020-11-02T06:24:25+05:30

ఎనభై ఏడు రూపాయలు పెడితే మీరో ఇంటి వారు కావచ్చు. అదేంటి? మరీ 87 రూపాయలకు ఇల్లు ఎవరు అమ్ముతారని అంటారా? అమ్ముతున్నారు. అయితే ఇక్కడ కాదు. ఇటలీలోని సిసిలీ అనే ఊరిలో!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎనభై ఏడు రూపాయలు పెడితే మీరో ఇంటి వారు కావచ్చు. అదేంటి? మరీ 87 రూపాయలకు ఇల్లు ఎవరు అమ్ముతారని అంటారా? అమ్ముతున్నారు. అయితే ఇక్కడ కాదు. ఇటలీలోని సిసిలీ అనే ఊరిలో!


ఈ ఊరు ఒకప్పుడు ప్రజలతో కళకళలాడుతూ ఉండేది. 1968లో వచ్చిన భూకంపం ప్రభావం ఈ ఊరిపై చాలా పడింది. ఆ తరువాత చాలా మంది ఇతర పట్టణాలకు తరలి వెళ్లారు. దాంతో ఊరంతా ఖాళీ అయింది.


ప్రస్తుతం ఆ ఊళ్లో అన్నీ ఖాళీ ఇళ్లే దర్శనమిస్తాయి. మళ్లీ ఎలాగైనా ఊరు జనంతో నిండిపోయేలా చేయాలని ప్రభుత్వం అక్కడి ఇళ్లను అతి తక్కువ ధరకు వేలంలో విక్రయిస్తోంది.


కనిష్ఠ ధర ఒక యూరోగా నిర్ణయించింది. ఒక యూరో అంటే ఇండియన్‌ కరెన్సీలో 87 రూపాయలు. ఈ ధర చెల్లించి ఇల్లు కొనుక్కోవచ్చు. ఒక్కొక్కరు ఒకటి కంటే ఎక్కువ వేలం పాటలోనూ పాల్గొనవచ్చు.


వేలం పాటలో ఇల్లు సొంతం చేసుకున్న వారు ఒక షరతును అంగీకరించాల్సి ఉంటుంది. 2,61,304 రూపాయలను డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. మూడేళ్లలో ఇంటిని మరమ్మతు చేయించు కుంటే ఆ డబ్బును తిరిగి ఇచ్చేస్తారు. 

Updated Date - 2020-11-02T06:24:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising