ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుమ్మరి దురదృష్టం!

ABN, First Publish Date - 2020-11-30T05:30:00+05:30

ఒక చిన్న ఊరిలో ఒక పేద కుమ్మరి నివసించేవాడు. ఒకరోజు అతడు ప్రమాదవశాత్తు కిందపడటంతో నుదుటికి గాయం అయింది. కొన్నిరోజులకు గాయం తగ్గిపోయినా మరక మాత్రం అలాగే ఉండిపోయింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక చిన్న ఊరిలో ఒక పేద కుమ్మరి నివసించేవాడు. ఒకరోజు అతడు ప్రమాదవశాత్తు కిందపడటంతో నుదుటికి గాయం అయింది. కొన్నిరోజులకు గాయం తగ్గిపోయినా మరక మాత్రం అలాగే ఉండిపోయింది. తరువాత ఆ ఊరు తనకు అంతగా కలిసి రాలేదని అనుకుంటూ మరో ఊరికి మకాం మార్చాడు. అదృష్టవశాత్తు అతనికి రాజు సభలో ఉద్యోగం దొరికింది. రాజు కుమ్మరి నుదుటిపై ఉన్న మరకను చూసి అతడు గొప్ప యుద్ధవీరుడు అయి ఉంటాడని భావించి ఉద్యోగం ఇచ్చాడు. సభలో అతడికి గొప్ప గౌరవ మర్యాదలు లభించాయి. కొన్ని నెలల తరువాత శత్రువులు ఆ రాజ్యంపై దాడి చేశారు. వెంటనే రాజు కుమ్మరిని పిలిచి సైన్యానికి నాయకత్వం వహించమని అదేశించాడు. ఆ మాటలు విన్న కుమ్మరి భయపడిపోయాడు. వెంటనే రాజుకు నిజం చెప్పాడు. నుదుటిపై మరక ఎలా ఏర్పడిందో పూస గుచ్చినట్టుగా వివరించాడు. నిజం తెలుసుకున్న రాజు కుమ్మరిని వెంటనే అక్కడి నుంచి వెళ్లిపొమ్మని ఆదేశించాడు. కుమ్మరి తన అదృష్టాన్ని నిందించుకుంటూ మరో ఊరికి పయనమయ్యాడు.

Updated Date - 2020-11-30T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising