ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈత కొట్టే ఒంటెలు!

ABN, First Publish Date - 2020-11-03T05:30:00+05:30

ఒంటెలు ఎడారుల్లో ఆహారం, నీటి కోసం వందల కొద్ది కిలోమీటర్ల దూరం నడుస్తాయని తెలుసు. అయితే ‘ఖరై’ అనే ఒంటెల ప్రత్యేకత ఏమిటంటే ఇవి కిలోమీటర్ల కొద్దీ ఈదగలవు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంటెలు ఎడారుల్లో ఆహారం, నీటి కోసం వందల కొద్ది కిలోమీటర్ల దూరం నడుస్తాయని తెలుసు. అయితే ‘ఖరై’ అనే ఒంటెల ప్రత్యేకత ఏమిటంటే ఇవి కిలోమీటర్ల కొద్దీ ఈదగలవు. ప్రస్తుతం ఈ రకమైన ఒంటెలు గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతంలో కొన్ని మాత్రమే ఉన్నాయి.


  1. ఈ ఒంటెలు దాదాపు మూడు నుంచి పది కిలోమీటర్ల వరకు ఈదుకుంటూ వెళతాయి. ఇవి మేలు జాతి ఒంటెలుగా గుర్తింపు పొందాయి.  గల్ఫ్‌ దేశాల్లో వీటితో పరుగుపందేలు నిర్వహిస్తారు.
  2. కచ్‌ ప్రాంతంలో ఉప్పు తయారీ కర్మాగారాలు, సిమెంట్‌ పరిశ్రమలు పెరిగిపోవడం, అడవులు నరికివేయడం వల్ల ఈ ఒంటెలకు ఆహార కొరత ఏర్పడుతోంది. దానివల్ల క్రమంగా వాటి సంఖ్య తగ్గుతూ వస్తోంది.
  3. ఖరై అంటే గుజరాతీ భాషలో ఉప్పు అని అర్థం. మిగతా ఒంటెలతో పోలిస్తే ఇవి ప్రత్యేకమైన వాతావరణంలో జీవించడానికి అలవాటు పడి ఉంటాయి. 

Updated Date - 2020-11-03T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising