ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిట్టి కవితతో మెప్పించింది!

ABN, First Publish Date - 2020-04-25T08:09:51+05:30

పిల్లల్లో రచనా నైపుణ్యాన్ని పెంచడానికి కవిత్వ పోటీలు బాగా ఉపయోగపడతాయి. పాఠశాలల్లో పిల్లల కోసం ప్రత్యేక పోటీలు నిర్వహిస్తుంటారు. అమెరికాలో ఏప్రిల్‌ నెలలో ‘నేషనల్‌ పొయెట్రీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైష్ణవి రాసిన....

‘‘ఇన్‌ ద నైట్‌, 

దేర్‌ ఈజ్‌ నో లైట్‌, 

బట్‌ ద మూన్‌ ఈజ్‌ బ్రైట్‌

అండ్‌ ద స్టార్స్‌ ఆర్‌ ఎ సైట్‌’’

అంటూ రాసిన చిట్టి కవిత తోటి విద్యార్థులకు కూడా బాగా నచ్చింది.


పిల్లల్లో రచనా నైపుణ్యాన్ని పెంచడానికి కవిత్వ పోటీలు బాగా ఉపయోగపడతాయి. పాఠశాలల్లో పిల్లల కోసం ప్రత్యేక పోటీలు నిర్వహిస్తుంటారు. అమెరికాలో ఏప్రిల్‌ నెలలో ‘నేషనల్‌ పొయెట్రీ మంత్‌’ను జరుపుతారు. ‘అకాడమీ ఆఫ్‌ అమెరికన్‌ పొయెట్స్‌’ సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటుంది. కవిత్వం బాగా రాసే వారిని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ సంస్థ పాఠశాలలకు అవసరమైన వనరులను అందజేస్తూ ఉంటుంది. 

ఇందులో భాగంగా న్యూయార్క్‌లోని మసీనా సెంట్రల్‌ స్కూల్‌ డిస్ట్రిక్ట్‌ పాఠశాలలో కవిత్వపు పోటీలు నిర్వహించారు. ఇందులో తెలుగమ్మాయి వైష్ణవి ఇంగ్లీష్‌లో రాసిన చిట్టి కవితకు టీచర్ల ప్రశంసలు లభించాయి. 

వైష్ణవి తల్లితండ్రులు లింగం భవాని, సుధాకర్‌లు హైదరాబాద్‌కు చెందిన వారు. ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడిన వారు వైష్ణవి ఆసక్తిని గమనించి ప్రోత్సహిస్తున్నారు.

చిన్నారి వైష్ణవి వయస్సు ఏడేళ్లు. ప్రస్తుతం రెండో తరగతి చదువుతోంది. 

Updated Date - 2020-04-25T08:09:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising