ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బుడత సాయం

ABN, First Publish Date - 2020-04-03T07:31:32+05:30

రాముడు లంకను చేరుకోవడానికి వారధి నిర్మించే సమయంలో ఉడత సహాయం చేసిందని రామాయణంలో చదువుకున్నాం. అలాగే కరోనా పోరులో ఈ బుడతలు ఉడతా భక్తిగా కిడ్డీ బ్యాంకులో దాచుకున్న డబ్బులను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాముడు లంకను చేరుకోవడానికి వారధి నిర్మించే సమయంలో ఉడత సహాయం చేసిందని రామాయణంలో చదువుకున్నాం. అలాగే కరోనా పోరులో ఈ బుడతలు ఉడతా భక్తిగా కిడ్డీ బ్యాంకులో దాచుకున్న డబ్బులను విరాళంగా అందిస్తూ సాయం చేస్తున్నారు. 

  • జగిత్యాలకు చెందిన సిరికొండ ఆశ్రిత తన పుట్టిన రోజు సందర్భంగా 
  • ముఖ్యమంత్రి సహాయనిధికి 1,016 రూపాయలను విరాళంగా అందించింది. ఎల్‌.కె.జి చదువుతున్న ఆశ్రిత కరోనా వైర్‌సపై పోరు కోసం కిడ్డీ బ్యాంకులో దాచుకున్న ఆ డబ్బును విరాళంగా ఇచ్చింది.
  • హైదరాబాద్‌ బండ్లగూడకు చెందిన విహాన్‌, వివాన్‌లు రూ.4,335లను సీఎం రిలీ్‌ఫఫండ్‌ కు అందించారు. టైమ్స్‌ స్కూల్‌లో 4వ తరగతి చదువుతున్న ఈ కవలలు తమ కిడ్డీ బ్యాంకులో డబ్బును కరోనా పోరు కోసం అందించారు.
  • సోషల్‌ మీడియాలో, టీవీల్లో కరోనా వార్తలు విన్న మిజోరాంకు చెందిన ఏడేళ్ల బుడతడు తను దాచుకున్న డబ్బును విరాళంగా అందించాడు.
  • మిజోరాంలోని కొలాసిబ్‌ వెంగ్లాయ్‌కు చెందిన రోమియెల్‌ లాల్‌మ్యుంగసానా తన కిడ్డీ బ్యాంకులో దాచుకున్న డబ్బును విరాళంగా ఇస్తానని తల్లితండ్రులతో అన్నాడు. అందుకు వాళ్లు సరే అన్నారు. మొత్తం లెక్కిస్తే రూ.333లుగా తేలింది. ఆ డబ్బును గ్రామ టాస్క్‌ఫోర్స్‌ సిబ్బందికి విరాళంగా అందించాడు. 
  • ఈ విషయం తెలుసుకున్న మిజోరాం ముఖ్యమంత్రి బుడతడిని అభినందిస్తూ ట్వీట్‌ చేశాడు. ‘‘నువ్వు నిజమైన హీరోవి. ఆ దేవుడి ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి’’ అని సీఎం అభినందించారు. 

Updated Date - 2020-04-03T07:31:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising