ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నక్కకు గుణపాఠం

ABN, First Publish Date - 2020-09-19T05:30:00+05:30

ఒక చిట్టడవిలో నక్క, కొంగ స్నేహంగా జీవించేవి. కొంగ స్నేహం స్వచ్ఛమైనది. కానీ నక్క మాత్రం స్వార్థపూరితంగా వ్యవహరించేది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక చిట్టడవిలో నక్క, కొంగ స్నేహంగా జీవించేవి. కొంగ స్నేహం స్వచ్ఛమైనది. కానీ నక్క మాత్రం స్వార్థపూరితంగా వ్యవహరించేది. ఒకరోజు నక్క, కొంగను తన ఇంటికి విందుకు  ఆహ్వానించింది. దాంతో కొంగ సంతోషపడింది. చెప్పిన సమయానికి బయలుదేరి నక్క ఇంటికి చేరుకున్న కొంగను సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించింది నక్క. ‘‘నీ కోసం రుచికరమైన వంటలు సిద్ధం చేశాను. భోజనం చేద్దాం రా!’’ అని లోపలకు తీసుకెళ్లింది. టేబుల్‌పై వెడల్పాటి పాత్రలు పెట్టి అందులో సూప్‌ పోసింది.


‘‘ఇది నీ కోసం చేసిన స్పెషల్‌ సూప్‌...తిను’’ అని పాత్రను కొంగ ముందు పెట్టింది నక్క. కానీ వెడల్పాటి పాత్రలో పోసిన సూప్‌ను కొంగ తాగలేకపోయింది. నక్క మాత్రం మొత్తం తాగేసింది. కొంగ తాగలేకపోవడాన్ని చూసి నక్క నవ్వుకుంది. నక్క చేసిన పనికి కొంగకు కోపం తెప్పిచ్చింది. కావాలనే నక్క పిలిచి అవమానించిందని అర్థం చేసుకుంది. కానీ తన కోపాన్ని ఎక్కడా వ్యక్తం చేయలేదు.


నక్కకు ఎలాగైనా గుణపాఠం చెప్పాలని అనుకుంది. మరుసటి రోజు కొంగ ‘‘మా ఇంటికి భోజనానికి  రా’ అని నక్కను ఆహ్వానించింది. నక్క హుషారుగా వచ్చింది. ఈసారి కొంగ కూడా సూప్‌ను తయారుచేసి పెట్టింది. అయితే పొడవైన కుండీల వంటి వాటిలో సూప్‌ను పోసింది. ‘‘ఏ మొహమాటం లేకుండా సూప్‌ తాగు. నీకోసం ప్రత్యేకంగా చేశాను’’ అంది కొంగ. కానీ నక్క వాటిలోని సూప్‌ తాగలేకపోయింది.  కొంగ గటగటా తాగేసింది. అప్పుడు నక్కకు తను చేసిన తప్పు తెలిసొచ్చింది. క్షమించమని అడిగింది.

Updated Date - 2020-09-19T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising