ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫూల్స్‌ జాబితా!

ABN, First Publish Date - 2020-05-02T05:50:02+05:30

శ్రీకృష్ణదేవరాయలకు గుర్రాలంటే ఇష్టం. ఆయన రాజ్యంలో మేలురకం జాతికి చెందిన గుర్రాలు చాలా ఉండేవి. ఒకరోజు ఓ వర్తకుడు విజయనగర రాజ్యానికి వచ్చాడు. తన దగ్గర అరేబియాలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకృష్ణదేవరాయలకు గుర్రాలంటే ఇష్టం. ఆయన రాజ్యంలో మేలురకం జాతికి చెందిన గుర్రాలు చాలా ఉండేవి. ఒకరోజు ఓ వర్తకుడు విజయనగర రాజ్యానికి వచ్చాడు. తన దగ్గర అరేబియాలో మాత్రమే లభించే మేలురకం జాతికి చెందిన గుర్రాలు ఉన్నాయని చెప్పుకున్నాడు. ఆ విషయం తెలిసి కృష్ణదేవరాయలు పిలిపించాడు. అతని దగ్గర ఉన్న గుర్రం రాజుకు బాగా నచ్చింది. ‘‘నాకూ అలాంటి గుర్రాలు రెండు కావాలి’’ అని అడిగాడు రాజు. అందుకు వర్తకుడు సరేనన్నాడు. ‘‘నేను అరేబియాకు వెళ్లి రెండు రోజుల్లో మీకు గుర్రాలు తీసుకువస్తాను’’ అన్నాడు వర్తకుడు. సరేనన్న రాజు 5 వేల బంగారు నాణేలు అడ్వాన్స్‌గా ఇచ్చాడు. రెండు వారాలు గడిచినా ఆ వర్తకుడు రాలేదు. ఒకరోజు రాజు తోటలో పచార్లు చేస్తుండగా తెనాలి రామకృష్ణ దూరంగా కూర్చుని ఏదో రాస్తుండడాన్ని గమనించాడు. ఆసక్తితో దగ్గరకి వెళ్లి ‘‘ఏం రాస్తున్నావు?’’ అని అడిగాడు. వెంటనే కాగితాన్ని రాజు చేతిలో పెట్టాడు రామకృష్ణ. అందులో పేర్ల జాబితా ఉంది. అంతేకాకుండా, మొదటి పేరు రాజుదే ఉంది. ‘‘ఈ జాబితా ఏంటి?’’ అని కుతూహులంగా అడిగాడు రాజు. ‘‘విజయనగర రాజ్యంలో ఉన్న తెలివితక్కువ వాళ్ల జాబితా అది’’ అన్నాడు రామకృష్ణ. ‘‘అయితే నా పేరు ఎందుకు చేర్చావు?’’ అని అడిగాడు రాజు. ‘‘వర్తకుడిని నమ్మి 5 వేల బంగారు నాణేలు ఇచ్చారు కదా! అందుకే’’ అన్నాడు రామకృష్ణ. ‘‘ఒకవేళ వర్తకుడు తిరిగొస్తే అప్పుడేం చేస్తావు?’’ ఆవేశంగా అడిగాడు రాజు. ‘‘అలా తిరిగొస్తే మీ పేరు తీసేసి ఆ వర్తకుడి పేరు చేర్చుతాను’’ అన్నాడు రామకృష్ణ.

Updated Date - 2020-05-02T05:50:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising