ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంట్లో ఇలా చేయండి!

ABN, First Publish Date - 2020-03-26T06:24:26+05:30

పిల్లలూ... కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ను ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పిల్లలూ... కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ను ప్రకటించింది. 

  1. ఏప్రిల్‌ మొదటి వారంలో పరీక్షలు ఉంటాయి అనుకుంటున్న తరుణంలో లాక్‌డౌన్‌ను ప్రకటించడం నిరాశను కలిగించింది. అయితే దేశ శ్రేయస్సు దృష్ట్యా తీసుకున్న నిర్ణయం కాబట్టి ఇంట్లో నుంచి బయట అడుగుపెట్టకండి.
  2. పరీక్షలు ఇప్పట్లో లేవు కదా అని చదవడం పూర్తిగా మానేయకండి. రోజూ ఉదయం, సాయంత్రం తప్పకుండా పుస్తకాలు తిరగేయండి.
  3. ఎప్పుడూ టీవీ ముందో, కంప్యూటర్‌ ముందో కూర్చోకుండా అన్నయ్యతో, తమ్ముడితో లేక చెల్లితో చెస్‌, క్యారంబోర్డ్‌ ఆటలు ఆడండి.
  4. డ్రాయింగ్‌ ప్రాక్టీస్‌ చేయడానికి ఇది మంచి సమయం. మీ చేతిరాత బాగా లేనట్లయితే రైటింగ్‌ స్కిల్‌ను మెరుగుపరుచుకోండి. 
  5. స్కూల్‌ స్నేహితులతో వాట్సప్‌లో ఛాటింగ్‌ చేసి పరీక్షలకు ఎలా ప్రిపేర్‌ అవుతున్నారో కనుక్కోండి. సందేహాలేమైనా ఉంటే తీర్చుకోండి. 
  6. ఆటలు ఆడిన తరువాత, భోజనానికి ముందు సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోండి.

Updated Date - 2020-03-26T06:24:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising