ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆకుపై అబ్బురపరిచే బొమ్మలు..!

ABN, First Publish Date - 2020-11-28T05:45:12+05:30

చాలామంది ఏదైన సమస్య ఉంటే బాధపడుతూ కూర్చుంటారు. కానీ జపాన్‌కు చెందిన కళాకారుడు రిటో అలా కుంగిపోతూ కూర్చోలేదు. తనకున్న సమస్యను అవకాశంగా మలుచుకున్నాడు. ఇప్పుడు సోషల్‌మీడియాలో హీరో అయ్యాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చాలామంది ఏదైన సమస్య ఉంటే బాధపడుతూ కూర్చుంటారు. కానీ జపాన్‌కు చెందిన కళాకారుడు రిటో అలా కుంగిపోతూ కూర్చోలేదు. తనకున్న సమస్యను అవకాశంగా మలుచుకున్నాడు. ఇప్పుడు సోషల్‌మీడియాలో హీరో అయ్యాడు. 


ఆయన చేతిలోని బొమ్మ కర్రపై చెక్కినది కాదు. ఒక చెట్టు ఆకును అందమైన ఆకృతులుగా మలిచాడు రిటో. 


ఆకును అంత చక్కగా మలచడానికి ఆయన కొన్ని గంటల పాటు శ్రమించాడు. ఆకుల మీద అందమైన బొమ్మలు వేయడానికి ఆయనకు స్ఫూర్తినిచ్చిన అంశం ఏమిటో తెలుసా? 


రిటో ఏడీహెచ్‌డీ అనే సమస్యతో బాధపడుతున్నాడు. ఏడీహెచ్‌డీ అంటే అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపర్‌యాక్టివిటీ డిజార్డర్‌. ఈ సమస్య ఉన్న వారు ఒక్క పని కూడా శ్రద్ధతో పూర్తి చేయలేరు. ఆసమస్య నుంచి బయటపడటం కోసం రిటో లీఫ్‌ ఆర్ట్‌వర్క్‌ను ఎంచుకున్నాడు. ఒకే ఆర్ట్‌వర్క్‌పై ఫోకస్‌ పెట్టి గంటల తరబడి పనిచేస్తున్నాడు. ఏడీహెచ్‌డీ చికిత్సలో భాగంగా ఆయన రోజులో ఒక ఆకును వివిధ ఆకృతుల్లో కత్తిరిస్తున్నాడు. 


రిటో ఆర్ట్‌వర్క్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఆయన ప్రతిభను అందరూ తెగ మెచ్చుకుంటున్నారు. 

Updated Date - 2020-11-28T05:45:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising