ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒంటె - సింహం

ABN, First Publish Date - 2020-07-20T05:30:00+05:30

ఒక దట్టమైన అడవికి రాజు సింహం. ఎప్పుడూ ఆ సింహం వెంట నక్క, కాకి, చిరుత తిరుగుతూ ఉండేవి. దాంతో వాటికి ఆహారానికి ఎప్పుడూ కొరత ఉండేది కాదు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక దట్టమైన అడవికి రాజు సింహం. ఎప్పుడూ ఆ సింహం వెంట నక్క, కాకి, చిరుత తిరుగుతూ ఉండేవి. దాంతో వాటికి ఆహారానికి ఎప్పుడూ కొరత ఉండేది కాదు. ఒకరోజు ఆ అడవిలోకి ఒక ఒంటె వచ్చింది. ఎడారిలో నివసించే ఆ ఒంటె దారితప్పి అడవిలోకి ప్రవేశించింది. ఆ అడవికి రాజైన సింహాన్ని ఒంటె కలిసింది. సింహం ఆ ఒంటెకు ఆశ్రయం ఇచ్చింది. నీకు ఇక్కడ రక్షణ ఉంటుందని హామీ ఇచ్చింది. ఒకరోజు ఏనుగుల దాడిలో సింహం గాయపడింది.


వేటకు వెళ్లలేకపోయింది. సింహంతో పాటు దాని సహాయకులైన కాకి, చిరుత, నక్క ఆకలితో అలమటించసాగాయి. అప్పుడు అవి ఒంటెను చంపి తిందామని సింహానికి సలహా ఇచ్చాయి. కానీ సింహం అందుకు ఒప్పుకోలేదు. అప్పుడు అవి ఒక పథకం వేశాయి. ఒంటె తనకు తానుగానే ఆహారం అయ్యేలా చేయాలని నిర్ణయించుకున్నాయి. సింహం దగ్గరకు వెళ్లి ‘‘రాజా... నువ్వు ఆకలితో ఉన్నావు. నన్ను ఆహారంగా తీసుకో!’’ అని కాకి కోరింది. అలాగే నక్క, చిరుత కూడా అన్నాయి. కానీ అందుకు సింహం నిరాకరించింది. వాటిని చూసిన ఒంటె కూడా ‘‘మీకిష్టమైతే నన్ను ఆహారంగా తీసుకోండి!’’ అని అడిగింది. వెంటనే సింహం ఒంటెను చంపి తినేసింది.

Updated Date - 2020-07-20T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising